Samyuktha Menon: తల్లిదండ్రుల కంటే ఆ వ్యక్తినే ఎక్కువగా ప్రేమించాను.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
తెరపై తన నటనతో, అందంతో కుర్రకారు మనసు దోచుకున్న ఆ మలయాళ కుట్టి.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ‘గోల్డెన్ లెగ్’ అనే ముద్ర వేయించుకుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

సాధారణంగా ఎవరైనా తమ తల్లిదండ్రులనే అత్యంత ఎక్కువగా ప్రేమిస్తామని చెబుతారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం “నేను ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమించానో.. అంతగా నా కన్నవారిని కూడా ప్రేమించలేదు” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఆమె అంతగా ఇష్టపడిన ఆ వ్యక్తి ఎవరు? ఆ హీరోయిన్ జీవితంలో దాగి ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్ ఏంటి?
వరుస విజయాలతో జోరు..
ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్. ఈ సంక్రాంతికి శర్వానంద్ హీరోగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ తో ఆమె ఖాతాలో మరో ఘన విజయం చేరింది. చాలా కాలం తర్వాత దక్కిన ఈ సక్సెస్ సంయుక్త కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె దూసుకుపోతోంది.
సంయుక్త తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో రానా భార్యగా ఆమె పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆరంభంలో ఆమెను కొందరు ‘జూనియర్ సమంత’ అని కూడా పిలిచేవారు. ఆ తర్వాత ‘విరూపాక్ష’, ‘సార్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, ఆమెకు ఆశించిన స్థాయిలో పెద్ద ఆఫర్లు రాలేదు. మధ్యలో బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ లో కనిపించినా, అది ఆమెకు వ్యక్తిగతంగా పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఇలాంటి తరుణంలో ‘నారీ నారీ నడుమ మురారి’ విజయం ఆమెకు మళ్ళీ అవకాశాల తలుపులు తెరిచింది.
ప్రేమపై సంయుక్త స్పందన..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంయుక్తకు ప్రేమ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. “మీరు ప్రేమను నమ్ముతారా?” అని అడగ్గా, ఏ మాత్రం తడబడకుండా “అవును” అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత “మీ జీవితంలో మీరు అత్యంత ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరు?” అని ప్రశ్నించగా, ఆమె తన తాతయ్య గురించి చెప్పుకొచ్చింది.
తాతయ్యే నా సర్వస్వం..
తన జీవితంలో తాతయ్యకు చాలా ప్రత్యేక స్థానం ఉందని సంయుక్త ఎమోషనల్ అయ్యింది. తల్లిదండ్రుల కంటే కూడా తాతయ్యనే ఎక్కువగా ప్రేమించానని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుండి ఆయన సంరక్షణలో పెరగడం లేదా ఆయనతో ఉన్న అనుబంధం కారణంగానే సంయుక్త ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మాటలు విన్న నెటిజన్లు ఆమెలోని సున్నితమైన మనస్తత్వాన్ని అభినందిస్తున్నారు. సినిమా విజయాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ సంయుక్త వార్తల్లో నిలుస్తోంది. ‘నారీ నారీ నడుమ మురారి’ విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈ హీరోయిన్ కి భవిష్యత్తులో టాలీవుడ్ లో ఎలాంటి భారీ అవకాశాలు వస్తాయో వేచి చూడాలి.
