AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండు చేపలను చీప్‎గా తీసి పారేయకండి.. ఇవి తెలిస్తే ఫుల్‎గా లాగించేస్తారు

ఎండు చేపలు అనే పేరు వినగానే వామ్మో.. మాకొద్దు బాబోయ్ ఆ వాసనను మేము తట్టుకోలేము అంటూ దీనిని చాలా మంది పక్కన పెట్టేస్తారు. అలాంటి వారు వీటి గురించి తెలుసుకుంటే వీటిని వదలకుండా అలవాటు చేసుకుని మరి తింటారు. మరి, ఇంకెందుకు లేట్ తెలుసుకుందామా..

Prasanna Yadla
|

Updated on: Jan 22, 2026 | 4:29 PM

Share
అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం: ఈ ఎండు చేపలలో ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి.  క్రీడలు ఆడే వాళ్ళు మాంసం కంటే వీటిని మీ భోజనంలో చేర్చుకుంటే మీ శరీరానికి కావాల్సిన శక్తీ లభిస్తుంది. అప్పుడు మీరు రోజంతా అలిసిపోకుండా ఉంటారు.  కొవ్వు పెరగకుండానే తగినంత ప్రోటీన్‌ను కూడా పొందుతారు.

1 / 5
గాయాలను తగ్గించే మంచి ఆహారం: ఎండు చేపలు గాయాలను తగ్గిస్తాయి. ఎందుకంటే, వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మంట మీద పోరాడుతుంది. ఇంకా  మీరు ఆస్తమా, సోరియాసిస్ తో బాధపడుతుంటే.. వాటిని తగ్గించడంలో ఎండు చేపలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.

2 / 5
బరువు తగ్గడం :  ఎండు చేపలలో  కేలరీలు చాలా తక్కువగా  ఉంటాయి. వీటిని మీ డైట్ లో చేర్చుకుంటే.. మీరు ఆరోగ్యంగా బరువు పెరగకుండా  ఉంటారు. 50 గ్రాముల ఎండు చేపలలో మీకు 150 కేలరీలతో పాటు ప్రోటీన్ దొరుకుతుంది.  కాబట్టి, దీనిని రాత్రి భోజనంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
మెదడు పనితీరును మెరుగుపరచడం : మీకు సరిగా గుర్తు ఉండటం లేదా ? జ్ఞాపక శక్తీ తక్కువగా ఉన్న వారు ఎండు చేపలు తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీనిని మీ ఆహారంలో చేర్చుకుంటే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

4 / 5
పళ్ళు,  ఎముకలకు మంచిది : విటిమిన్ డి తక్కువగా ఉండే వాళ్లు దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే  వీటిలో దొరికే  విటమిన్ డి  పళ్ళు,  ఎముకలను బలపరుస్తుంది. మీరు దీనిని  మీ భోజనంలో చేర్చుకోవడం వలన పళ్ళు, ఎముకలు బలంగా తయారవుతాయి. ఇంకా చెప్పాలంటే ఇది సహజంగా దొరుకుతుంది.

5 / 5