వాళ్లు నన్ను మోసం చేశారు.. కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోలేదు.. ఇకపై ఊరుకునేది లేదన్న శర్వా
గతంలో పోల్చితే పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేశాడు శర్వానంద్. గతేడాది అతను నటించిన మనమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ యావరేజ్ గానే నిలిచింది. ప్రస్తుతం బైకర్ అనే సినిమా చేస్తున్నాడు అలాగే నారి నారి నడుమ మురారి అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు ఛార్మింగ్ స్టార్.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. గతకొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న శర్వా.. రీసెంట్ గా హిట్ కొట్టాడు నారీ నారీ నడుమ మురారి సినిమాతో హిట్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, ఎమోషన్స్ తో ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ నారీ నారీ నడుమ మురారి. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు. ఈ సినిమా కు రోజు రోజుకు థియేటర్స్ పెరుగుతున్నాయి.
ఈ సినిమా సక్సెస్ తో ఆనందంలో తేలిపోతున్నాడు హీరో శర్వానంద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తనకు, నిర్మాత అనిల్ సుంకర మధ్య విభేదాలు, ఆరోపణలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం పై క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తల్లో నిజం లేదని శర్వానంద్ అన్నారు. తమ మధ్య గొడవలు ఉన్నాయన్నది వాస్తవం కాదని, ఒకవేళ గొడవలు ఉంటే ఐదు నిమిషాల్లోనే ఫోన్ పెట్టేసుకుంటామని, కానీ తాము తరచుగా గంటన్నర పాటు మాట్లాడుకుంటామని శర్వా తెలిపారు. అనిల్ సుంకర అంటే తనకు సోదరుడితో సమానమని, ఆయన జోలికి తామెవరమూ వెళ్లమని, ఆయన బ్యానర్ పట్ల తమకు భయం, గౌరవం రెండూ ఉన్నాయని శర్వానంద్ అన్నారు. అలాగే గత ఆరేళ్లుగా తనకు సరైన హిట్ లేదని, ఈ పరిస్థితిలో తాము అనేక విధాలుగా నష్టపోయామని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. గతంలో తాను చాలా మంది నిర్మాతలకు సహాయం చేశానని, అయితే వారు తిరిగి మోసం చేశారని, కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన నిలబడలేదని శర్వానంద్ గుర్తు చేసుకున్నారు. ఈ అనుభవాలతో తాను ఇతరులను నమ్మడానికి భయపడుతున్నానని, ఒక రకమైన తెలియని అయోమయంలోకి వచ్చానని చెప్పారు. అయితే, అనిల్ సుంకర విషయంలో తనకు అలాంటి అనుమానాలు లేవని, అతనిపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. మనిషిని నమ్మలేకపోతే బ్రతకడం వ్యర్థమని శర్వా అన్నాడు. చిన్న చిన్న విషయాల్లో మోసపోవడానికి సిద్ధమేనని, కానీ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని శర్వానంద్ గట్టి హెచ్చరిక చేశారు. ఎన్ని రోజులు మోసపోతామని, ఇప్పుడు ఎవరైనా మోసం చేస్తే గట్టిగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చాడు శర్వానంద్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
