Ritu Varma: ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ.. మధ్యలో రీతూ వర్మ ఎంట్రీ..

ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరలయ్యింది. అయితే ఈవీడియో పై నటుడు ప్రియదర్శి స్పందిస్తూ.. డార్లింగ్ అదరగొట్టేశావ్ అంటూ కామెంట్ చేశాడు. "ఏయ్ మిస్టర్.. మాట్లాడేముందు జాగ్రత్త.. డార్లింగ్ అని తెలియని వాళ్లను పిలవడం నేరం" అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ప్రియదర్శి స్పందిస్తూ.. "అవునా.. నువ్వెప్పుడు నాకు తెలియని వ్యక్తివి అయ్యావ్" అంటూ కామెంట్ చేశాడు. ఇలా ఎందుకు వై దిస్ కొలవరీ అంటూ రియాక్ట్ అయ్యాడు ప్రియదర్శి.

Ritu Varma: ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ.. మధ్యలో రీతూ వర్మ ఎంట్రీ..
Priyadarshi, Ritu Varma, Nabha natesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2024 | 2:29 PM

టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య డార్లింగ్ గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి వీరిద్దరి మధ్య డార్లింగ్ అనే పదం గురించి ఫన్నీగా మాటల యుద్ధం నడుస్తుంది. మరోవైపు ప్రభాస్ పలు ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో మాట్లాడిన డార్లింగ్ పదాలను ఒక్కచోట చేర్చి ఫన్నీగా రీల్ చేసింది నభా నటేష్. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరలయ్యింది. అయితే ఈవీడియో పై నటుడు ప్రియదర్శి స్పందిస్తూ.. డార్లింగ్ అదరగొట్టేశావ్ అంటూ కామెంట్ చేశాడు. “ఏయ్ మిస్టర్.. మాట్లాడేముందు జాగ్రత్త.. డార్లింగ్ అని తెలియని వాళ్లను పిలవడం నేరం” అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ప్రియదర్శి స్పందిస్తూ.. “అవునా.. నువ్వెప్పుడు నాకు తెలియని వ్యక్తివి అయ్యావ్” అంటూ కామెంట్ చేశాడు. ఇలా ఎందుకు వై దిస్ కొలవరీ అంటూ రియాక్ట్ అయ్యాడు ప్రియదర్శి. ఇక బుధవారం వీరిద్దరి డార్లింగ్ గొడవ నెట్టింట తెగ వైరలయ్యింది. ఇప్పుడు తమ గొడవలోకి మరో హీరోయిన్ రీతూ వర్మను లాక్కొచ్చారు.

రీతూ వర్మ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలపై ప్రియదర్శి స్పందిస్తూ.. హాయ్ డార్లింగ్.. అద్భుతంగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో మళ్లీ నభా నటేష్ రియాక్ట్ అవుతూ.. అగో మళ్లీ డార్లింగ్ అంటున్నాడు అంటూ రిప్లై ఇచ్చింది. ఇక వీరిద్దరి గొడవ పై రీతూ వర్మ రియాక్ట్ అయ్యింది. నా పోస్ట్ కింద మీ కామెంట్స్ గోల ఏంటీ ? అంటూ కౌంటరిచ్చింది. ఇక ఇందుకు ప్రియదర్శి రియాక్ట్ అవుతూ ఇది గోల కాదు డార్లింగ్.. నీ మీదున్న ఆరాధన.. నువ్వే నభాకి చెప్పు అంటూ కామెంట్ చేశాడు. అలాగే ప్రియదర్శి ప్రతి కామెంట్లో వై దిస్ కొలవరి ? అనే పదం కనిపిస్తుంది. అయితే నభా నటేష్, ప్రియదర్శి డార్లింగ్ గొడవ అనేది కేవలం సినిమా ప్రమోషన్ కోసమే అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ముగ్గురి సంభాషణ నెట్టింట వైరలవుతుంది.

వీరిద్దరు కలిసి ఏదైనా సినిమా చేస్తున్నారా ? అందుకే తమ సినిమాను ఇలా భిన్నంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రియదర్శి ఫుల్ ఫాంలో ఉన్నాడు. బలగం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే ఇటీవల సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ద్వారా మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ స్వయంభు సినిమాలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.