Rashmika Mandanna: యంగ్ హీరో కోసం రష్మిక మందన.. స్టాండప్ రాహుల్ నుంచి పదా సాంగ్ రిలీజ్..

Rashmika Mandanna: యంగ్ హీరో కోసం రష్మిక మందన.. స్టాండప్ రాహుల్ నుంచి పదా సాంగ్ రిలీజ్..
Stand Up Rahul

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు.

Rajitha Chanti

|

Jan 19, 2022 | 6:31 AM

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే అనుభవించు రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం స్టాండప్ రాహుల్. ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతన్న ఈ మూవీని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు.

ఇందులో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఇక టాలీవుడ్ అగ్రకథాయిక రష్మిక మందన ఈ సినిమా నుంచి పదా అనే పాటను విడుదల చేశారు. ఇందులో నలుగురు స్నేహితులు రోడ్ ట్రిప్‌లో వెళ్తున్నట్లుగా చూపించారు. ఇక ఈ విజువల్స్ చూస్తుంటే.. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మల మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉన్నట్టు కనిపిస్తోంది. రెహమాన్ రాసిన సాహిత్యం.. రాజ్ తరుణ్, వర్షల మధ్య ఇష్టాన్ని తెలియజేసేలా ఉంది.

స్వీకర్ అగస్తి మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. యాజిన్ నాజర్ గాత్రం చక్కగా కుదిరింది. శ్రీరాజ్ రవీంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజ్ తరుణ్ లుక్స్ ట్రెండీగా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ క్యూట్‌గా కనిపిస్తున్నారు. జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా సినిమా మీద అంచనాలను పెంచేశాయి. ఇందులో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

Also Read: Anasuya Bharadwaj : నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ.. ఇంతకు అతడు ఏమడిగాడంటే..

Bangarraju: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు.. బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu