AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: అతిలోక సుందరి వీపుపై బోనీ కపూర్ పేరు.. అసలు కథేంటంటే..

తన అందం, అభినయంతో టాలీవుడ్‌లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. అభిమానుల మదిలో ‘అతిలోక సుందరి’గా గుర్తుండిపోయిన ఆమె బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడింది.

Sridevi: అతిలోక సుందరి వీపుపై బోనీ కపూర్ పేరు.. అసలు కథేంటంటే..
Basha Shek
|

Updated on: Jan 19, 2022 | 5:59 AM

Share

తన అందం, అభినయంతో టాలీవుడ్‌లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. అభిమానుల మదిలో ‘అతిలోక సుందరి’గా గుర్తుండిపోయిన ఆమె బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత జాన్వీకపూర్‌, ఖుషి కపూర్‌లకు అమ్మగా మారింది. తన పెద్ద కూతురును సిల్వర్‌ స్ర్కీన్‌పై చూడాలన్న కోరిక తీరకుండానే మూడేళ్ల క్రితం అకాల మరణం చెందింది. అయితే అతిలోక సుందరి లేని లోటును తీర్చేందుకు జాన్వీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. త్వరలో చిన్న కూతురు ఖుషీ కూడా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా శ్రీదేవి మన మధ్య లేకపోయినా  భర్త బోనీ కపూర్‌ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో  శ్రీదేవికి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తుంటారు. అలా తాజాగా మరొక ఫొటోను పంచుకున్నాడు.

ఆ పేరు అక్కడ ఎవరు రాశారబ్బా?..

ఇందులో  అతిలోక సుందరి తెల్లటి చీరకట్టులో  ఎంతో అందంగా కనిపించడం, దీనికి తోడు ఆమె  వీపుపై ‘బోనీ’ అన్న ఇంగ్లిష్ అక్షరాలు సింధూరంతో రాసి ఉండటం తో ఈ ఫొటో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.  కాగా ఈ ఫోటోని షేర్ చేసిన బోనీ కపూర్  ‘2012లో లక్నోలోని సహారా సహర్ ప్రాంతంలో జరిగిన దుర్గా పూజ సంబరాల వేళ ‘  అంటూ ఫొటో దిగిన సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నారు.   కాగా ఈ ఫొటో ప్ర స్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.  ‘ ఓ మేరీ చాంద్ నీ వియ్ మిస్ యూ’ అని ఒకరు స్పందించగా..   ‘ఆమె మన మధ్య లేరనే సత్యం ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నాను’’ అంటూ  మరొకరు కామెంట్ పెట్టారు.   ‘ఇంతకి శ్రీదేవి వీపుపై ఆ పేరు ఎవరు రాశారు సర్? ’’ అంటూ  మరికొందరు స్పందించి బోనీ నుంచి పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.

View this post on Instagram

A post shared by Boney.kapoor (@boney.kapoor)

Also Read: Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

Dog with girl: అబ్బ.. ఈ కుక్క చేసే విన్యాసాలు చూస్తే ఫిదా అయిపోతారు..! వైరల్‌ అవుతున్న వీడియో