Dog with girl: అబ్బ.. ఈ కుక్క చేసే విన్యాసాలు చూస్తే ఫిదా అయిపోతారు..! వైరల్ అవుతున్న వీడియో
పెంపుడు కుక్కలు వారి యజమానులతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తాయి. ఒక్కోసారి అవి చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క నాలుగేళ్ల చిన్నారితో కలిసి విన్యాసాలు చేస్తుంది.
పెంపుడు కుక్కలు వారి యజమానులతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తాయి. ఒక్కోసారి అవి చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క నాలుగేళ్ల చిన్నారితో కలిసి విన్యాసాలు చేస్తుంది. ఆ చిన్నారి ఏం చెప్తే అది చేస్తుంది. ఆ పాప చేతులు పక్కకు చాపితే వాటిపైనుంచి జంప్ చేస్తుంది. కాలు పైకి ఎత్తితే దాని కిందనుంచి అటూ ఇటూ తిరుగుతుంది. ఆమె నేలపై పాకుతుంటే తనతోపాటే పాకుతుంది. రెండు కాళ్లు పైకెత్తి గిరగిరా తిరుగుతుంది. ఆ చిన్నారి ఎవరినో పిలుస్తుంటే తనూ పిలుస్తుంది. ఆ బాలిక తలక్రిందులుగా నిలబడితే ఆమె పైనుంచి జంప్ చేస్తుంది.. అబ్బో ఈ కుక్క విన్యాసాలు చూడాల్సిందే.. చెప్పడానికి వీలుకానంతగా చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడయో చూసిన నెటిజన్లు వారిద్దరి విన్యాసాలకు ఫిదా అయిపోతున్నారు. మానవులు, జంతువులు ఎందుకు మంచి స్నేహితులుగా ఉంటారో అందరికీ అర్థమవుతుందంటూ కామెంట్ చేస్తున్నారు.
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

