Pushpa: సామీ.. నా సామీ పాటకు స్టెప్పులేసిన యషిక.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

Pushpa: సామీ.. నా సామీ పాటకు స్టెప్పులేసిన యషిక.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..
Yashika Anand

టాలీవుడ్ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన ‘నోటా’ సినిమాతో ఒకేసారి కోలీవుడ్, టాలీవుడ్ కు పరిచయమైంది యషికా ఆనంద్.  ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అంతకు ముందు కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది.

Basha Shek

| Edited By: Phani CH

Jan 19, 2022 | 9:14 AM

టాలీవుడ్ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన ‘నోటా’ సినిమాతో ఒకేసారి కోలీవుడ్, టాలీవుడ్ కు పరిచయమైంది యషికా ఆనంద్.  ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అంతకు ముందు కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే గతేడాది జులైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చిందీ ముద్దుగుమ్మ. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు చనిపోగా యషిక మూడు నెలల పాటు ఆస్పత్రి బెడ్ కే పరిమితమైంది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ, ఫిజియో థెరపిస్టుల సలహాలు తీసుకుని ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. గతంలో ఓకే చెప్పిన సినిమా షూటింగులకు కూడా హాజరవుతోంది.  కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా  సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఒకటి  నెట్టింట్లో వైరల్ గా మారింది.

మళ్లీ నిన్ను ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.  గతేడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇందులోని పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలువురు ప్రముఖులు ‘పుష్ప’ సినిమాలోని పాటలకు రీక్రియేషన్లు, స్ఫూప్ లు, కవర్ సాంగ్ లు చేస్తున్నారు.  ఈ క్రమంలో  బన్నీ సినిమాలోని   ‘సామీ.. నా సామీ’ పాటకు సరదాగా స్టెప్పలేసింది యషిక. లంగావోణిలో ఎంతో సంప్రదాయబద్ధంగా ముస్తాబై మరీ ఈ పాటకు కాలు కదిపింది.  అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.  ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు  ‘ఇలా నిన్ను చూడటం సంతోషంగా ఉంది’  అని స్పందిస్తుంటే.. మరికొందరు ‘ఉ అంటావా మావ’ పాటకు కూడా డ్యాన్స్ చేయండి’ అంటూ ఆమెను కోరుతున్నారు. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న యషిక డ్యాన్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

IND VS SA: దక్షిణాఫ్రికాకు షాకింగ్ న్యూస్.. వన్డే సిరీస్ నుంచి స్టార్ బౌలర్ ఔట్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu