Ram charan: హీరో సినిమాను వీక్షించిన మెగా పవర్ స్టార్.. ఏం చెప్పాడంటే..
ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ' హీరో'. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాకు గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు, నరేష్,

ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాకు గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు, నరేష్, బ్రహ్మాజీ, రోల్ రీడా కీలకపాత్రలలో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీక్షించారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘అశోక్ గల్లా.. సినిమా ప్రపంచంలోకి నీ ఎంట్రీ అదిరిపోయింది. ‘హీరో’ సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌గారికి, పద్మావతిగారికి, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు ఇంకా టీమ్ మొత్తానికి అభినందనలు. మీరు అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్ ట్వీట్ కు ‘హీరో’ గల్లా అశోక్ స్పందించాడు. ‘ధన్యవాదాలు రామ్ చరణ్ అన్న.. మా సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అశోక్ ట్విట్టర్ లో తెలిపాడు. కాగా ‘హీరో’ సినిమా ఓపెనింగ్ కు చరణ్ హాజరై క్లాప్ కొట్టారు. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అతిథిగా చెర్రీ హాజరు కావాల్సి ఉంది.. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతను ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. అయితే తాను రాలేకపోయినప్పటికీ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మెగా పవర్ స్టార్ ట్వీట్ చేశారు. ఇప్పుడు సినిమాను చూసి ‘హీరో’ టీం కు శుభాకాంక్షలు తెలిపాడు.
Thank you so so much @AlwaysRamCharan anna!!! Sooo happy you liked our film ?? https://t.co/WEmfFCVM3X
— Ashok Galla (@AshokGalla_) January 18, 2022
Also Read: Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..
Covid Vaccine: గర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ సమయంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Viral: నక్షత్రమండలం నుంచి భూమిని చేరిని అరుదైన ‘నలుపు’ వజ్రం.. త్వరలోనే వేలం!




