AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజు నిజంగానే పాము కాటేసింది.. సెట్‌లోనే అతను చనిపోయాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్..

ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమాల్లో దేవి ఒకటి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్ గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా మారారు.ఇక ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాన్నీ ప్రేమ పంచుకున్నారు.

ఆ రోజు నిజంగానే పాము కాటేసింది.. సెట్‌లోనే అతను చనిపోయాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్..
Prema
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2025 | 8:59 AM

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుల్లో కోడిరామకృష్ణ ఒకరు. ఈ దివంగత దర్శకుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. సోషియో ఫాంటసీ సినిమాలకు పెట్టింది పేరు కోడిరామకృష్ణ. ఇప్పుడు రాజమౌళి సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. కోడిరామకృష్ణ  సినిమాలకు అప్పట్లో అంతే క్రేజ్ ఉండేది. కోడిరామకృష్ణ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో దేవి సినిమా ఒకటి. నాగుపాము నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దేవి సినిమాలో దేవి శ్రీ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హీరోయిన్ ప్రేమ నటించింది. అప్పట్లోనే లేడీఓరియేంటేడ్ మూవీ ఇది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు అయ్యింది.

తాజాగా ఈ సినిమా గురించి నటి ప్రేమ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రేమ మాట్లాడుతూ.. అప్పట్లో లేడీ ఓరియేంటేడ్ సినిమాలు అంటే చాలా పెద్ద రిస్క్ అయినా కూడా కోడిరామకృష్ణ ఈ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు అని తెలిపింది ప్రేమ. ఆ సినిమా అంతే పెద్ద విజయం సాధించడానికి కారణం కోడిరామకృష్ణ అని అన్నారు ప్రేమ. ఒకొక్క సీన్ కు 50 టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు ప్రేమ.

ఆయన నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించారు. గెటప్ వేసిన తర్వాత దేవత ఎలా మాట్లాడుతుందో.. ఆమె హావభావాలు ఎలా ఉంటాయో చెప్తూ దగ్గరుండి చేయిచారు అని తెలిపింది ప్రేమ. సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం.. షూటింగ్ లో పాము ఒక వ్యక్తిని నిజంగానే కాటువేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన అతన్ని బ్రతికించుకోలేకపోయాం అని తెలిపింది ప్రేమ. ఇక ఈ సినిమా క్లామాక్స్ సమయంలోనూ చాలా ఇబ్బందిపడ్డం.. మంచులో షూటింగ్ చేశాం అని తెలిపింది ప్రేమ. సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పెద్దకష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ లో హిట్ అవుతుందని ఊహించలేదు అని తెలిపింది ప్రేమ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.