Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR : మా నాన్న లేని లోటు ఆ హీరోయిన్ తీర్చారు.. తారక్ ఎమోషనల్ కామెంట్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత దేవర సినిమాతో హిట్ కొట్టాడు తారక్. ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మాములుగా రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరో చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. దాన్ని తారక్ బ్రేక్ చేశాడు.

NTR : మా నాన్న లేని లోటు ఆ హీరోయిన్ తీర్చారు.. తారక్ ఎమోషనల్ కామెంట్స్
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2025 | 8:48 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దేవరతో హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అలాగే దేవర 2లోనూ నటిస్తున్నారు తారక్. ఇదిలా ఉంటే తాజాగా తారక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు తారక్. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటనపై ప్రశంసలు కురిపించారు తారక్. సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఒక తల్లి-కొడుకు ఎమోషనల్ బంధాన్ని ఆధారంగా చేసుకున్న కమర్షియల్ చిత్రమని, ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు తారక్. కళ్యాణ్ రామ్ తన సినిమాలతో ఎప్పుడూ కొత్తదనం తీసుకొస్తాడని, ఈ సినిమా కూడా అలాంటి ప్రయత్నమేనని పేర్కొన్నారు.

విజయశాంతి గురించి మాట్లాడుతూ.. ఆమె లేడీ సూపర్‌స్టార్‌గా తెలుగు సినిమాకు ఎంతో గొప్ప పేరు తెచ్చారని, ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిపారు. విజయశాంతి  తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తారని అన్నారు. అలాగే ఈ రోజు విజయశాంతి మాట్లాడుతుంటే.. మా నాన్న గారు గుర్తొచ్చారు. ఈ రోజు.. నాన్న లేని లోటు విజయశాంతి భర్తీ చేశారని… వెల్లడించారు తారక్. సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతుందని, అందరూ థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరారు తారక్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..