Anitha: కీలక నిర్ణయం తీసుకున్న ‘నువ్వు నేను’ అనిత.. బుల్లి తెరకు కూడా గుడ్ బై చెప్పనున్న బ్యూటీ..
Anitha: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు నటి అనిత. నువ్వు నేను చిత్రంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నారు. అనంతరం శ్రీరాం, తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రడీ.. వంటి వరుస చిత్రాల్లో తళుక్కుమని...
Anitha: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు నటి అనిత. నువ్వు నేను చిత్రంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నారు. అనంతరం శ్రీరాం, తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రడీ.. వంటి వరుస చిత్రాల్లో తళుక్కుమని నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే అనిత రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అనితకు ఓ చిన్నారి ఉంది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనిత.. సిల్వర్ స్క్రీన్‌కు బ్రేక్ ఇచ్చి.. బుల్లితెరపైకి వచ్చారు. నాగినితో పాటు పలు ఇతర సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అనిత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని అనిత స్వయంగా తెలిపారు. ఇక నుంచి వెండి తెరతో పాటు బుల్లి తెరకు దూరంగా ఉండనున్నట్లు చెప్పుకొచ్చారు అనిత. ఇకపై పూర్తి సమయాన్ని తన చిన్నారికి కేటాయించాలని నిర్ణయించుకున్న అనిత.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కరోనా లాంటి పరిస్థితులు లేకపోయినా ఇలాంటి నిర్ణయమే తీసుకునే దానినని చెప్పుకొచ్చిందీ అలనాటి అందాల తార.
Also Read: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జోరుమీద పవర్ స్టార్..
Telangana: అడవి బిడ్డలు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్నారు.. .అధికారులు వద్దంటున్నా