AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చచ్చిపోవాలనుకున్నా.. ఆ ఫోటోలు షేర్ చేయకండి.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

చాలా మంది ఛాన్స్ లు రాక బాధపడుతుంటే.. ఈ అమ్మడు మాత్రం అస్సలు అలాంటి పాత్రలు ఎందుకు చేశాను అని బాధపడుతుంది. ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇంతకు ఆ భామ ఎవరు..? ఆమెకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా..? ఇంతకు ఆమె మరెవరో కాదు.. ముంతాజ్ ఈ చిన్నదని పేరు చెప్తే చాలా మంది గుర్తుపట్టలేరు.. కానీ ఫోటో చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.?

చచ్చిపోవాలనుకున్నా.. ఆ ఫోటోలు షేర్ చేయకండి.. కన్నీళ్లు పెట్టుకున్న నటి
Mumtaz
Rajeev Rayala
|

Updated on: Apr 06, 2024 | 8:40 AM

Share

ఎన్నో సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసింది.. అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసి అందరి చేత వావ్ అనిపించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో మెరిసి తన అందంతో కుర్రాళ్లకు కిర్రెక్కించింది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే చాలా మంది ఛాన్స్ లు రాక బాధపడుతుంటే.. ఈ అమ్మడు మాత్రం అస్సలు అలాంటి పాత్రలు ఎందుకు చేశాను అని బాధపడుతుంది. ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇంతకు ఆ భామ ఎవరు..? ఆమెకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా..? ఇంతకు ఆమె మరెవరో కాదు.. ముంతాజ్ ఈ చిన్నదని పేరు చెప్తే చాలా మంది గుర్తుపట్టలేరు.. కానీ ఫోటో చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.?

తారీఖు, ఖుషి, చాలాబాగుంది, జెమిని, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, పెళ్లి కాని పెళ్లాం అవుతుంది, ఆగడు, టామీలాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాలో స్పెషల్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ చేసింది. అదేవిధంగా.. అత్తారింటికి దారేది సినిమాలో సాంగ్ లో నటించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఆగదు సినిమాలో కూడా నటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది.

అయితే ఇప్పుడు ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఒకప్పుడు గ్లామర్‌ రోల్స్‌ చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పింది ఈ చిన్నది. ముంతాజ్ గ్లామర్ రోల్స్ లో నటించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటీకి వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ ఫోటోలను డిలీట్ చేయాలని ఉందని తెలిపింది. తన దగ్గ బోలెడంత డబ్బుంటే వాటితో సోషల్ మీడియాలో ఉన్న తన గ్లామరస్ ఫోటోలను డిలీట్ చేస్తానని తెలిపింది ముంతాజ్. అది నా వల్ల కానీ పని అని తెలిపింది. దయచేసి నా ఫ్యాన్స్ నా గ్లామర్‌ పిక్స్‌ షేర్‌ చెయ్యొద్దు. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలు మాత్రం షేర్‌ చేయకండి అని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం.!’ అంటూ ముంతాజ్‌ ఎమోషనలైంది. ఒకరోజు నాకు ఉన్నట్టుండి విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. ఎటూ కదల్లేకపోయాను. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఆ నొప్పి మాత్రం తగ్గలేదు. రెండేళ్లు ఆ నొప్పిని అలాగే భరించాను. ఆ తర్వాత నాకు ఆటో ఇమ్యూన్‌ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎన్నో రోజులు నొప్పులతో విలవిల్లాడిపోయేదాన్ని. కీళ్ల జాయింట్‌ వద్ద సమస్య వల్ల కూర్చోలేకపోయేదాన్ని. సరిగా నిలబడలేకపోయేదాన్ని. శరీరాన్ని కదిలించడమే కష్టమయ్యేది అని కన్నీళ్లు పెట్టుకుంది ముంతాజ్. అలాగే ఒకానొక టైం లో నేను డిప్రషన్ కు లోనయ్యా.. నొప్పితో ఏడ్చేదాన్ని.. రోజంతా ఏడ్చేదాన్ని.. నా కుటుంబం నాకు తోడుగా నిలబడలేదు.. దాంతో చచ్చిపోవాలని కూడా ప్రయతించా.. అని ఎమోష్నలైంది ముంతాజ్.

View this post on Instagram

A post shared by Mumtaz (@mumtaz_mumo)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us