Mamtha Mohandas : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆ సమయంలో దేవుడిలా కనిపించారు.. హీరోయిన్ మమతా మోహన్ దాస్..
నటి మమతా మోహన్‌దాస్ 2009లో తన క్యాన్సర్ నిర్ధారణ జరిగిందని వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ హీరో ఆమెకు ఓ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. క్యాన్సర్ వార్త తెలిసిన తర్వాత తాను ఏ సినిమాలోనూ నటించలేనని ఆయనతో చెప్పగా, ఆయన నెక్స్ట్ వీక్ మళ్ళీ కాల్ చేసి, కథ వినమని, ట్రీట్‌మెంట్ ప్రారంభించమని సూచించారని గుర్తుచేసుకున్నారు.

హీరోయిన్ మమతా మోహన్‌దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాతో టాలీవుడ్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ అప్పటికే క్యాన్సర్ నిర్దారణ కావడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మమతా మోహన్‌దాస్ తన జీవితంలోని కీలక ఘట్టాన్ని, క్యాన్సర్ నిర్ధారణ సమయంలో కేడి సినిమా అనుభవాలను ఇటీవల పంచుకున్నారు. మొదట కింగ్ చిత్రంలో ఆమె పాత్రకు అనుకున్న కథ మారినప్పుడు, దానికి ప్రత్యామ్నాయంగా నాగార్జున ఆమెను కేడి సినిమా కోసం సంప్రదించారు. సరిగ్గా అదే సమయంలో, అంటే 2009లో, మమతా మోహన్‌దాస్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని నాగార్జునకు చెప్పినప్పుడు, తాను ఇక ఏ సినిమాలోనూ నటించలేనని ఆమె వివరించారు. ఈ వార్తతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె ఫోన్‌లోనే ఏడ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
అయితే, నాగార్జున ఆమెను అర్థం చేసుకుని, ఒక వారం తర్వాత మళ్ళీ కాల్ చేశారు. అప్పుడు “మమత, నేను నీ మాటలు అర్థం చేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ కాల్ చేస్తాను. ట్రీట్‌మెంట్ ప్రారంభించు, మేము నీ కోసం ఎదురు చూస్తాం, కథ విను” అని ధైర్యం చెప్పారు. కేడి సినిమా షూటింగ్ ఆమె ఆరు నెలల కీమోథెరపీ చికిత్స సమయంలోనే జరిగింది. దర్శకుడు కిరణ్, నిర్మాత చందన్, నాగార్జునలు కలిసి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించారు. మమత ఆరు నెలల పాటు కీమోథెరపీ సైకిల్స్‌తో పాటు సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొనేలా చూశారు.
ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
ప్రతి 14 రోజులకు ఒకసారి ఆమె కీమోథెరపీ చేయించుకునేవారు. చికిత్స తర్వాత రెండు రోజులు తీవ్ర అలసటతో గడిపేవారు. ఆ తర్వాత మూడో లేదా నాలుగో రోజు నుంచి షూటింగ్‌కు వెళ్లి, నాలుగు రోజుల పాటు పని చేసి తిరిగి వచ్చేవారు. ఈ షెడ్యూల్ ఆరు నెలల పాటు కొనసాగింది. కీమోథెరపీ చేయించుకుంటూ, జుట్టు కోల్పోవచ్చని, ఇతర సమస్యలు రావచ్చని మమత నాగార్జునకు చెప్పగా, ఆయన “సమస్య లేదు, మనం కలిసి ఈ సినిమాను పూర్తి చేద్దాం” అని భరోసా ఇచ్చారు. ఈ కష్ట సమయంలో కేడి సినిమా షూటింగ్ తనకు గొప్ప ఉపశమనాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. “ఆ సమయంలో నాగార్జున నాకు దేవుడిలా కనిపించారు. ఆయన సానుకూల దృక్పథం, ఆశ కల్పించడం నాకు గొప్ప బలం” అని మమతా మోహన్‌దాస్ గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

Mamta Mohandas, Nagarjuna
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..
