Ravinder Chandrasekar: చిక్కుల్లో నటి మహాలక్ష్మి భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు విషయం ఏమిటంటే?
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటి మహాలక్ష్మి భర్త రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది ప్రముఖ టీవీ నటి మహాలక్ష్మితో కలిసి ఆయన పెళ్లిపీటలెక్కారు. అయితే ఈ పెళ్లి అయినప్పటినుంచి మహాలక్ష్మి, రవీందర్‌ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. కొందరు నెటిజన్లు రవీందర్‌ను బాడీ షేమింగ్ చేస్తూ నెట్టింట పోస్టులు షేర్ చేశారు. అలాగే డబ్బు కోసమే మహాలక్ష్మి చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకుందంటూ విమర్శలు గుప్పించారు.

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటి మహాలక్ష్మి భర్త రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది ప్రముఖ టీవీ నటి మహాలక్ష్మితో కలిసి ఆయన పెళ్లిపీటలెక్కారు. అయితే ఈ పెళ్లి అయినప్పటినుంచి మహాలక్ష్మి, రవీందర్‌ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. కొందరు నెటిజన్లు రవీందర్‌ను బాడీ షేమింగ్ చేస్తూ నెట్టింట పోస్టులు షేర్ చేశారు. అలాగే డబ్బు కోసమే మహాలక్ష్మి చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకుందంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్రోల్స్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారీ లవ్లీ కపుల్. ఆతర్వాత మహాలక్ష్మీ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయంటూ, విడాకులు కూడా తీసుకోనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ తమ బ్యూటిఫుల్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టేస్తున్నారీ క్యూట్ కపుల్. ఆ మధ్యన తన భర్త రవీందర్ పుట్టిన రోజును కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది మహాలక్ష్మి. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవల ఛీటింగ్ కేసుల్లో రవీందర్ పేరు తరచూ వినిపిస్తోంది. గతంలో చెన్నై పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు కూడా నమోదైంది. తాజాగా మరోసారి చిక్కుల్లో పడ్డాడీ కోలీవుడ్ ప్రొడ్యూసర్. ఒక బిజినెస్‌మెన్‌ను మోసం చేసినందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది .
వివరాల్లోకి వెళితే.. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పెట్టి బెలెడన్నీ లాభాలు పొందవచ్చని రవీందర్ చెన్నైకు చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మించాడట. ప్లాంట్ కోసం నకిలీ పత్రాలను సృష్టించి.. వాటితో బాలాజీని నమ్మించి ప్రాజెక్టులో పార్ట్‌నర్ చేశాడు. ఇందుకోసం బాలాజీ నుంచి సుమారు రూ. 16 కోట్లు తీసుకున్నట్లు రవీందర్‌పై అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2020 సెప్టెంబర్ 17న బాలాజీ, రవీందర్‌ల మధ్య ఒప్పందం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఒప్పందం జరిగిన తర్వాత రరవీందర్ ప్లేటు ఫిరాయించాడని, తాను చెప్పినట్లు ఒక్క పని కూడా జరగలేదంటున్నాడు బాలాజీ. పైగా డబ్బు తిరిగి ఇచ్చేయమని అడిగినా రెస్పాన్స్ లేదంటున్నాడు. అందుకే రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు బాలాజీ. దీంతో పోలీసులు నిర్మాతను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రవీందర్‌పై మోసపురిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నాని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామంటున్నారు చెన్నై పోలీసులు.
భర్త రవీందర్ తో నటి మహాలక్ష్మి
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.







