- Telugu News Photo Gallery Cinema photos Anushka shetty, Naveen polishetty Miss shetty Mr polishetty first day box office collection
Miss Shetty Mr Polishetty: తొలి రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎంత వసూల్ చేసిందంటే..
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క నటించింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటించగా.. నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటించాడు.
Updated on: Sep 08, 2023 | 3:03 PM

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క నటించింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటించగా.. నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటించాడు. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. సినిమా క్లిన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

అనుష్క తన నటనతో ఆకట్టుకోగా.. నవీన్ తన కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్స్ సీన్స్ లో తన నటనతో కట్టిపడేసాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకబడింది.

తొలి రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది. అదే రోజున షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా రిలీజ్ కావకాడంతో ఈ సినిమా పై ఎఫెక్ట్ పడింది. జవాన్ ఓవర్ అల్ గా 150 కోట్లు వసూల్ చేసింది.

కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రం ఇండియాలో కేవలం రూ.4 కోట్లు వచ్చాయి. తమిళ్ లోనూ ఈ సినిమాకు అంతగా కలెక్షన్స్ రావడం లేదు. ఇక అమెరికాలో తొలి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం వసూలైనట్టు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ కలెక్షన్ ఉపందుకుంటాయేమో చూడాలి




