AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్.ఆర్.నగర్‌లో ఉంటూ స్కూటీపై ఛానెళ్లకు తిరిగా.. ఎనిమిదో తరగతి నుంచే కలలు కన్నా..

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంటే అంత ఈజీ కాదు.. హీరోయిన్ గా చేయాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కొంతమంది హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నపటికీ నిలదొక్కుకోలేరూ. ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీలో కనిపించకుండా మాయం అవుతుంటారు .

ఎస్.ఆర్.నగర్‌లో ఉంటూ స్కూటీపై ఛానెళ్లకు తిరిగా.. ఎనిమిదో తరగతి నుంచే కలలు కన్నా..
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2026 | 7:14 PM

Share

సినిమాల్లో హీరోయిన్స్ గా మెప్పించి ఆతర్వాత కనిపించకుండా మాయం అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ బ్యూటీ చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు ఆతర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈఅమ్మడు . ఇదిలా ఉంటే వివాదాలతో ఈ బ్యూటీ ఎక్కువ వార్తల్లోనిలిచింది . ఇటీవలే ఓ వివాదంలో బాగా నలిగింది ఈ చిన్నది. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన మాధవి లత.

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో మాధవి లత తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలు పంచుకుంది. తెలుగు చిత్రసీమలో నచ్చావులే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె, స్నేహితుడా వంటి చిత్రాల్లోనూ నటించారు. అయితే, తన మొదటి సినిమాతోనే పరిశ్రమలో షీ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ అనే ముద్ర పడిందని ఆమె తెలిపింది. తాను షూటింగ్ సెట్స్‌లో అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తినని, ఎప్పుడూ రిజర్వ్‌డ్‌గా ఉండలేదని స్పష్టం చేసింది. తనతో పనిచేసిన వారందరూ ఇప్పటికీ తనతో సన్నిహితంగా ఉంటారని, తాను సెట్స్‌లో అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ గడుపుతానని తెలిపింది. మాధవి లత సినీరంగ ప్రవేశానికి ముందు యాంకర్‌గా చేసిందట. హైదరాబాద్‌లోని ఎస్.ఆర్. నగర్‌లో నివసిస్తూ, స్కూటీపై వివిధ ఛానెళ్లకు తిరుగుతూ ఉండేదాన్నిఅని తెలిపింది. ఆతర్వాత సీరియల్స్ లో నటించా..

ఇవి కూడా చదవండి

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

నటి కావాలనే కోరిక తనకు చిన్నతనం నుంచే ఉన్నప్పటికీ, కుటుంబం అంగీకరించదని, సరైన మార్గదర్శకం లేకపోవడంతో యాంకరింగ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. నచ్చావులే దర్శకుడు రవిబాబుతో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఆయన షూటింగ్‌లో నటీనటులను తిట్టడం సర్వసాధారణమని, అయితే ఆయనతో మళ్లీ సినిమా చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని, అది ఆయనను అడగాలని పేర్కొన్నారు. చివరిగా, రాజకీయాల్లోకి రావాలనే తన ఆకాంక్ష ప్రస్తుత ఆలోచన కాదని, చిన్ననాటి నుంచే అంటే ఎనిమిదో తరగతి నుంచే తనకు రాజకీయాల్లో ఉండాలని, ఒక గ్రామ సర్పంచ్‌గా మారాలని కలలు కన్నానని మాధవి లత స్పష్టం చేశారు. ఈ డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవడానికి ఒక జీవితం సరిపోదని ఆమె అన్నారు. కొత్తగా కలలు కనడానికి తనకు సమయం లేదని, చిన్ననాటి కలలను నెరవేర్చుకోవడానికే తన జీవితం సరిపోదని చెప్పుకొచ్చింది.

హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us