ఆ స్టార్ హీరోయిన్ కు పెళ్లి.. రాత్రంతా ఏడ్చిన అల్లు అర్జున్..
Rajitha Chanti
Pic credit - Instagram
08 April 2026
అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. బన్నీకి సీనయిర్ హీరోయిన్ శ్రీదేవి అంటే వీరాభిమానం.
తన జీవితంలో తనకు ఉన్న ఏకైక 'సెలబ్రిటీ క్రష్' శ్రీదేవి అని బన్నీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాగే శ్రీదేవి మరణవార్త విన్నప్పుడు అల్లు అర్జున్ ఎంతలా తల్లడిల్లిపోయారో చెప్పక్కర్లేదు.
1996 జూన్‌లో శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నప్పుడు అల్లు అర్జున్ రోజంతా కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆ రోజు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
బన్నీకి శ్రీదేవి అంటే కేవలం అందమైన నటి మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప ప్రేరణ. చిన్నప్పటి నుండి ఆమె సినిమాలను చూస్తూ పెరిగిన బన్నీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయ్యారు.
ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. "నాకు ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఇష్టం, కానీ శ్రీదేవి నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఆమె నా ఏకైక క్రష్" అని చెప్పారు.
శ్రీదేవి మరణించిన సమయంలో అల్లు అర్జున్ తన పనులన్నీ పక్కన పెట్టి, ఆమెకు నివాళులు అర్పించేందుకు వెళ్లారు. ఆమె మరణం తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని అన్నారు.
పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, తనలోని ఈ 'ఫ్యాన్ బాయ్' కోణాన్ని బయటపెట్టడం ఆయన సున్నిత మనస్తత్వానికి నిదర్శనం.
నేటికీ శ్రీదేవి ప్రస్తావన వస్తే బన్నీ కళ్ళలో ఒక తెలియని మెరుపు, అదే సమయంలో ఆమె లేరన్న చిన్నపాటి బాధ కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం రాకా చిత్రంలో నటిస్తున్నారు.