మిస్ ఇండియాకు బంపర్ ఆఫర్.. రామ్ చరణ్ సినిమాలో మానస వారణాసి..

Rajitha Chanti

Pic credit - Instagram

08 April 2026

ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం కోసం మిస్ ఇండియా 2020 విజేత మానస వారణాసిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మానస వారణాసి హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

వరుస అవకాశాలు వస్తుండడంతో ఆమె చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

రామ్ చరణ్ వంటి గొప్ప డ్యాన్సర్‌తో కలిసి స్టెప్పులేయడం మానస కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మానస వారణాసి కూడా తోడవడంతో సినిమా గ్లామర్ డోస్ మరింత పెరగనుంది.

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెహమాన్ అందించే మెలోడీ లేదా మాస్ బీట్‌కు చరణ్, మానస కలిసి చేసే డ్యాన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని తెలుస్తోంది. 

2020 మిస్ ఇండియా అందాల పోటీలలో కిరీటాన్ని అందుకున్న మానస వారణాసి.. 2021 మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి పదవ స్థానంలో నిలిచింది.