AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Purple Cap: పర్పుల్ క్యాప్ వేటలో ఐదుగురు.. అగ్రస్థానంలో బీసీసీఐకి నచ్చనోడు..!

IPL 2026 Purple Cap: భారత ప్రీమియర్ లీగ్ 2026 ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ క్రమంలో, అత్యధిక వికెట్ల వీరుడికి లభించే పర్పుల్ క్యాప్ కోసం పోటీ తీవ్రమైంది. అనుభవజ్ఞులతో పాటు యువ కెరటాలు కూడా ఈ జాబితాలో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం అగ్రస్థానం కోసం ఐదుగురు బౌలర్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

IPL 2026 Purple Cap: పర్పుల్ క్యాప్ వేటలో ఐదుగురు.. అగ్రస్థానంలో బీసీసీఐకి నచ్చనోడు..!
Ipl 2026 Purple Cap
Venkata Chari
|

Updated on: Apr 08, 2026 | 6:40 PM

Share

IPL 2026 Purple Cap: భారత ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముందుకు సాగే కొద్దీ అభిమానులలో ఆసక్తి రెట్టింపు అవుతోంది. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే, బౌలర్లు కూడా వికెట్లతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా, ప్రతిష్టాత్మకమైన పర్పుల్ క్యాప్ దక్కించుకోవడానికి బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా, ఐదుగురు బౌలర్లు ఈ రేసులో ముందున్నారు. వారి ప్రదర్శన ఎలా ఉందో ఓసారి చూద్దాం..

అగ్రస్థానంలో రవి బిష్ణోయ్..

ప్రస్తుతం ఈ జాబితాలో భారత యువ స్పిన్నర్, రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రవి బిష్ణోయ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న అతను, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 11.71 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 9.11గా ఉంది. తన అద్భుత ప్రదర్శనతో ఈ రేసులో అందరికంటే ముందున్నాడు.

పోటీలో రాజస్థాన్ మరో బౌలర్.!

రవి బిష్ణోయ్ తర్వాత, అదే రాజస్థాన్ జట్టుకు చెందిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నండ్రే బర్గర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో తన వేగంతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న బర్గర్, 15.20 సగటుతో ఐదు వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు 8.44గా ఉండటం విశేషం. రాజస్థాన్ జట్టు నుంచి ఇద్దరు బౌలర్లు తొలి రెండు స్థానాల్లో ఉండటం వారి బౌలింగ్ బలాన్ని చూపిస్తుంది.

మూడు, నాలుగు స్థానాల్లో విదేశీ ఆటగాళ్లు..

ఈ జాబితాలో మూడో స్థానంలో పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు. 29 ఏళ్ల ఈ బౌలర్, ఆడిన మూడు మ్యాచ్‌లలో 14.40 సగటుతో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ బౌలర్, బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాకబ్ డఫీ నిలిచాడు. 31 ఏళ్ల ఈ బౌలర్ కేవలం రెండు మ్యాచ్‌లలోనే 16.00 సగటుతో ఐదు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

ఐదో స్థానంలో యువ కెరటం..

చివరగా, ఐదో స్థానంలో చెన్నై జట్టు యువ కెరటం అన్షుల్ కంబోజ్ ఉన్నాడు. 25 ఏళ్ల ఈ యువకుడు కూడా ఐదు వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. మూడు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి 24.40 సగటుతో ఈ వికెట్లు సాధించాడు. ప్రస్తుతానికి ఈ ఐదుగురు బౌలర్లు ముందంజలో ఉన్నప్పటికీ, టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ జాబితాలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి.

Purple Cap Holder

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!