Lavanya Tripathi: అనాథ విద్యార్థి గృహంలో సందడి చేసిన అందాల రాక్షసి.. లావణ్యను ప్రశంసిస్తున్న నెటిజన్లు
కొంతమంది మాత్రం సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ మాత్రం అనాధ పిల్లలతో సందడి చేసింది. ఆ భామ మరెవరో కాదు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది లావణ్య

సినిమాలతోనే కాదు కొంతమంది సినీ తారలు సేవ కార్యక్రమాలతోనూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు కూడా సేవ కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే. మాములుగా హీరోయిన్స్ అంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ ను ఎక్కువగా వెళ్తుంటారు. కొంతమంది మాత్రం సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ మాత్రం అనాధ పిల్లలతో సందడి చేసింది. ఆ భామ మరెవరో కాదు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోతుంది ఈ భామ. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది లావణ్య.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అనాధాశ్రమం లో సందడి చేసింది. హైదరాబాద్ లోని అనాథ విద్యార్థి గృహాన్ని సందర్శించి వారితో సరదాగా గడిపింది. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసింది లావణ్య.




విద్యార్థులతో కలిసి సరదాగా మాట్లాడిన లావణ్య వారితో కలిసి భోజనం చేసింది. ఆ విద్యార్డుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా అని తెలిపింది లావణ్య. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య మంచి మనసు తెలుసుకొని ప్రేక్షకులు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
