ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది కీర్తి సురేష్. అతి తక్కువ సమయంలో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మాహానటి సావిత్రిలో పాత్రలో నటించిన కీర్తి నటనకు సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్కారు వారి పాట మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఇదే కాకుండా.. మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న బోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెల్లిగా కనిపించనుంది కీర్తి. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలోనూ కీర్తిసురేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే.. అటు తమిళంలోనూ వరుస ఆఫర్లను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించనున్నట్లుగా టాక్. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్‌ను సంప్రదించగా.. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తాజా సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ తమిళంలో మరో మూవీ చేయనున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా ఎంపికైందని టాక్ వినిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు.
Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..
Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..