Tollywood : రూమర్స్‏కు చెక్ పెట్టిన హీరోయిన్.. రెండోసారి తల్లికాబోతున్న టాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత దక్షిణాదిలో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళంలో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. కానీ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. భర్త, కొడుకుతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Tollywood : రూమర్స్‏కు చెక్ పెట్టిన హీరోయిన్.. రెండోసారి తల్లికాబోతున్న టాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..
Ileana

Updated on: Feb 16, 2025 | 8:05 AM

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తొలి చిత్రమే భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని కుర్రాళ్ల హృదయాల్లో నిలిచిపోయింది. కొన్నాళ్లుగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. కొన్నాళ్ల క్రితమే పండంటి బాబుకు జన్మనిచ్చింది. భర్త, కొడుకుతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తన ఇన్ స్టా పోస్టుతో ఆ రూమర్లకు చెక్ పెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ఇలియానా. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది.

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఇలియానా.. అక్కడ సైతం అంతగా ఆఫర్స్ రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. 2023లో ఇలియానా పండంటి బాబుకు జన్మనిచ్చింది. తన కొడుకుకు కోవా ఫీనిక్స్ డోలన్‌ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. భర్త మైఖేల్ డోలన్‌, కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్‌ తో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతునట్లు తెలిపింది. పఫ్ కార్న్ స్నాక్స్, యాంటాసిడ్ చుయింగమ్ ప్యాకెట్స్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ప్రెగ్నెంట్ అని చెప్పకుండా..నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాలి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఇలియానా.. తన పెళ్లి గురించి.. తన భర్త గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. తన భర్త గురించి కొన్నాళ్లపాటు సస్పెన్స్ మెయింటైన్ చేసింది. 2023లో కొడుకు జన్మించిన తర్వాత తన భర్త పేరును రివీల్ చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన