Huma Qureshi: యానిమల్ సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది.. నేను కూడా అలాంటి సినిమా చేస్తా..
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. అలాగే రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే యానిమల్ పై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ సినిమాలో మహిళలను అభ్యంతరకరంగా చూపించారనే ఆరోపణలు కూడా చేశారు. దుర్భషలాడటం, మితిమీరిన క్రూరత్వం చూపించారని కొందరు ఆరోపించారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు ఈ సినిమా బాగా నచ్చింది. రణవీర్ సింగ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు.

గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. అలాగే రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే యానిమల్ పై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ సినిమాలో మహిళలను అభ్యంతరకరంగా చూపించారనే ఆరోపణలు కూడా చేశారు. దుర్భషలాడటం, మితిమీరిన క్రూరత్వం చూపించారని కొందరు ఆరోపించారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు ఈ సినిమా బాగా నచ్చింది. రణవీర్ సింగ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు.
ఇప్పుడు బాలీవుడ్ నటి హుమా ఖురేషి కూడా ‘ యానిమల్ ‘ చిత్రాన్ని మెచ్చుకుంది . అలాంటి సినిమాలో తాను కూడా నటించాలని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. ఆ అమ్మడు మాట్లాడుతూ.. ‘యానిమల్ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో యాక్షన్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. అన్ని రకాల సినిమాలు నిర్మించాలి. చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. ఇలాంటి సినిమా నేను కూడా చేయాలి అని హ్యూమా ఖురేషి చెప్పుకొచ్చింది.
‘‘ఇంత విధ్వంసకర పాత్రలో నటించడం ఎగ్జైటింగ్‌గా ఉంది. అందులో ఏదో ఉంది. అది ఏమిటో నాకు తెలియదు. సినిమాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేయడం నిజమైతే మనం చాలా కాలంగా మంచి సినిమాలు చేస్తున్నాం. ఇప్పటికే సామాజిక సంస్కరణ జరిగి ఉండాల్సింది. అలాగే సమాజం నాశనం కాదు. ఏదైనా సినిమా చేయండి. జనాలకు నచ్చితే చూస్తారని హుమా ఖురేషి చెప్పుకొచ్చింది. యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు OTTలో కూడా అందుబాటులో ఉంది. ‘యానిమల్’ విజయం తర్వాత దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా డిమాండ్ పెరిగింది. సందీప్‌రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు.
హుమా ఖురేషి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
హుమా ఖురేషి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.