Geeta Singh: ఆ హీరో నా కుమారుడికి ఫ్రీగా చదువు చెప్పించాడు.. కానీ జాబ్ రాగానే .. నటి గీతా సింగ్ కన్నీళ్లు
కితకితలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 50కు పైగా సినిమాల్లో నటించిన ఆమె సడెన్ గా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే టీవీ షోస్ లలో కనిపిస్తోంది. తాజాగా ఓ టాక్ షోకు హాజరైన గీతా సింగ్ తన జీవితంలో జరిగిన ఓ విషాదం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఉత్తరాదికి చెందిన గీతా సింగ్ కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది 2005లో ఎవడి గోల వాడిదే సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. వీటితో పాటు ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖా పరిణయం, ఆకాశ రామన్న, సీమ టపాకాయ్, కెవ్వు కేక, కళ్యాణ వైభోగమే, రెడ్, జంప్ జిలానీ, సరైనోడు, ఈడో రకం అడో రకం, తెనాలి రామకృష్ణ ఇలా దాదాపు 50కు పైగా సినిమాల్లో నటించింది గీతా సింగ్. అయితే వ్యక్తిగత సమస్యలతో గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది నటి. రెండేళ్ల క్రితం గీతా సింగ్ అల్లారు ముద్దుగా పెంచుకున్న సోదరుడి కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఇది ఆమెను బాగా కలిచి వేసింది. ఈ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఒక టాక్ షో పాల్గొంది గీతా సింగ్. జబర్దస్త్ ఫేమ్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ సెలబ్రిటీ టాక్ షోలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుందీ అందాల తార.
‘నేను అన్నయ్య కొడుకుని నా కొడుకులాగే పెంచుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఈ లోకంలో లేడు. రెండేళ్ల క్రితం ఓ సారి టూర్ కి వెళ్ళాడు. అక్కడ డివైడర్ కి గుద్దుకొని యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఈ ఘటన నన్ను మానసికంగా కుంగివేసింది. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. దేవుడి మీద బాగా కోపం వచ్చింది. నన్ను తీసుకెళ్లి నా కుమారుడిని ఉంచినా బాగుండేది ‘
కూతురుతో నటి గీతా సింగ్..
View this post on Instagram
‘నా కుమారుడికి మంచు విష్ణు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. టెన్త్ అయ్యాక విష్ణు గారే ఫోన్ చేసి తిరుపతి కాలేజీ లో సీట్ ఉంచాను అని చెప్పాడు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన నా కొడుకుపై ఇంత దయ చూపిస్తారని ఏ రోజు కూడా అనుకోలేదు. చదువు అయ్యాక నా కుమారుడికి 2022 డిసెంబర్ లో జాబ్ వచ్చింది. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2023 ఫిబ్రవరిలో యాక్సిడెంట్ అయింది. బాబు చనిపోయాక కూడా విష్ణు బాబు కాల్ చేసి ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి అని అడిగారు. ఇప్పుడు నాకు తోడుగా ఓ పాప ఉంది. తనని ఎలాగైనా డాక్టర్ చేయాలి’ అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది గీతా సింగ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








