Vijay Varma: తమన్నా మాజీ ప్రియుడితో డేటింగ్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సదరు హీరోయిన్ ఈ రూమర్స్ పై స్పందించింది.

బాలీవుడ్ హీరో విజయ్ వర్మ, మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని సమాచారం. తమన్నాతో బ్రేకప్ తర్వాత హీరో విజయ్ మరో హీరోయిన్ ప్రేమలో పడ్డారని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ఆమె మరెవరో కాదు.. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షైఖ్. వీరిద్దరు కలిసి పలుమార్లు కనిపించడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. గత వారం రోజులుగా ఈ ప్రచారం తెగ వైరలవుతుంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ ఫాతిమా తన గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫాతిమా.. అందులో మాట్లాడుతూ.. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని.. ఒకరు చెప్పేది మరొకరు వినాలని అన్నారు.
ఫాతిమా మాట్లాడుతూ.. “ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ కావాలి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ అనుబంధాన్ని ముందుకు నడిపించారు. అప్పుడే ఆ బంధం కొనసాగుతుతంది. అలాంటి వ్యక్తి మాత్రం నా జీవితంలో ఎవరూ లేరు. మంచి వాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో విజయ్ వర్మ, ఫాతిమ ప్రేమాయణం పై క్లారిటీ వచ్చేసింది. అలాగే తన అనారోగ్య సమస్యల గురించి సైతం ఫాతిమా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
తనకు మూర్ఛ వ్యాధి ఉందని.. అమెరికా వెళ్తున్న సమయంలో విమానంలోనే తనకు మూర్ఛ వచ్చిందని.. దీంతో తనను ఎయిర్ పోర్ట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించారని చెప్పుకొచ్చింది. మూర్చ తగ్గకపోవడంతో ఎక్కువ డోసు ఇచ్చారని.. దీంతో తన శరీరంపై ఎఫెక్ట్ అయ్యిందని తెలిపింది. బెడ్ రెస్ట్ తీసుకోక తప్పలేదని.. అప్పుడు తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని తెలిపిందే. తన అనారోగ్యం కారణంగా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తనకున్న వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడయ్యానని.. అందుకే తనకు ఫిట్స్ వస్తాయని చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె మాధవన్ జోడిగా ఆఫ్ జైసా కోయ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా జూలై 11న నెట్ ఫ్లిక్ లో విడుదల కానుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..








