AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి పాత్రలు మళ్లీ చేయను.. చనిపోయినట్లు అనిపించిందన్న హీరోయిన్

ఎస్త‌ర్ నోరోన్హా.. టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. వెయ్యి అబద్దాలు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది బబ్లీ బ్యూటీ ఎస్త‌ర్ నోరోన్హా .

అలాంటి పాత్రలు మళ్లీ చేయను.. చనిపోయినట్లు అనిపించిందన్న హీరోయిన్
Esternoronha
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2026 | 5:49 PM

Share

అందాల భామ ఎస్తేర్ నొరోన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా చేసిన ఆమె ఆతర్వాత సహాయకపాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గానూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ సుందరి. కాగా ఈ అందాల భామ ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌, ఎదుర్కొన్న సవాళ్లనుపంచుకున్నారు.సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు చిత్రం తర్వాత తన కెరీర్ గ్రాఫ్‌లో జాప్యం, ఒడిదుడుకులు ఎదురయ్యాయని ఆమె తెలిపింది. దీనికి కారణం కేవలం స్క్రిప్ట్ ఎంపిక మాత్రమే కాదని, పరిశ్రమలో తాను చూడని పొల్యూటెడ్ సిట్యువేషన్స్ ను ఎదుర్కొనవలసి వచ్చిందని పరోక్షంగా తెలిపింది.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

అయితే, ఆ తర్వాత విభిన్న మనస్తత్వాలు, రిక్వైర్‌మెంట్స్ తో తనను సంప్రదించినప్పుడు ఆశ్చర్యపోయానని తెలిపారు. సరోజ్ ఖాన్, తేజ వంటి ప్రముఖులు సినీ పరిశ్రమ స్వభావం గురించి, తన దారిని తాను ఎంచుకోవాల్సిన అవసరం గురించి ముందే చెప్పినప్పటికీ, వ్యక్తిగతంగా ఎదుర్కొన్నప్పుడు అది అసహ్యకరంగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. తన మనస్తత్వానికి సరిపడని షరతులతో కూడిన వంద సినిమాల్లో నటించడం కంటే, తనకు సంతృప్తినిచ్చే పనులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసింది . ఆ సమయంలోని అనేక చిత్రాలు హీరోయిన్లకు కేవలం మూస పాత్రలనే అందించాయని, కేవలం అందంగా కనిపించడం, అమాయకత్వం ప్రదర్శించడం, విలన్ల బారి నుండి హీరో వచ్చి కాపాడటం వంటి పాత్రలకే హీరోయిన్లు పరిమితమయ్యారని తెలిపింది. పాటలలో “స్కిన్ షో” అవసరం కావడం వంటి డిమాండ్లు పెరిగాయని, మాధురి దీక్షిత్, శ్రీదేవి వంటి వారికి లభించిన నటనకు ఆస్కారమిచ్చే పాత్రలు ఇప్పుడు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

 వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

జయ జానకి నాయక సినిమా అనుభవాన్ని వివరిస్తూ, ఈ మల్టీస్టారర్‌లో ఒక చిన్న విరామం తర్వాత నటించడానికి ఒప్పుకున్నానని అన్నారు. అయితే, అందులో తన పాత్ర (వదిన)కు సరైన క్యారెక్టరైజేషన్, సంభాషణలు, నటనకు అవకాశం లేదని ఆమె నిరాశ వ్యక్తం చేసింది. ఈ సినిమా చేసేటప్పుడే తనకు “జాబ్ సాటిస్‌ఫాక్షన్” లభించలేదని, కేవలం దుస్తులు మార్చుకొని, ఇతర మహిళలతో పాటు ఏడ్చే సన్నివేశాలకే పరిమితం కావడం తనను “చనిపోయినట్లు” అనిపించిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా తనకు పేరు తెచ్చినప్పటికీ, అలాంటి పాత్రలు మళ్లీ చేయకూడదని స్పష్టమైన అవగాహన వచ్చిందని తెలిపింది. అటువంటి “వదిన, అక్క, సిస్టర్, ఫ్రెండ్” వంటి మూస పాత్రలకు పెద్ద బ్యానర్ల నుండి ఆఫర్లు వచ్చినా తిరస్కరించానని, డబ్బు కంటే నటనకు ప్రాధాన్యత ఇస్తానని ఎస్తేర్ నొరోన్హా చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us