AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కూడా కమిట్మెంట్ అడుగుతారు.. అసలు విషయం బయట పెట్టిన టాలీవుడ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు.

షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కూడా కమిట్మెంట్ అడుగుతారు.. అసలు విషయం బయట పెట్టిన టాలీవుడ్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2025 | 6:04 PM

Share

ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్  సమస్య ఒకటి.  సినిమా ఇండస్ట్రీలో తరచుగా దీని గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద చర్చే జరిగింది. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. కొంతమంది వీటికి వెతిరేకంగా మాట్లాడారు కూడా..  దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు చాలా మంది నటీమణులు. అంతే కాదు తమలా ఎవరూ లైంగిక వేధింపుల బారిన పడొద్దని, అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని , అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. కాగా తాజాగా ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతారని.. అంతే కాదు షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కు కూడా కమిట్మెంట్ అడుగుతారని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ గా ఎదుగుతున్న వారిలో ఎస్తేర్ నోరోన్హా ఒకరు. సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో ఎస్తేర్ నోరోన్హా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఈ చిన్నది వేయి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత సునీల్ తో సినిమా చేసింది. బబ్లీ గా ఉండే ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ఈ అమ్మడు. కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిపోయాయి. ఆతర్వాత సింగర్ నోయల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు.

ఇవి కూడా చదవండి

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ నోరోన్హా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ గా ఎదగాలంటే చెడ్డ దారిలో వెళ్లి త్వరగా స్టార్ అవ్వొచ్చు.. కానీ నాకు అది ఇష్టం లేదు. చాలా మంది హీరోయిన్స్ లా నేను కూడా కమిట్మెంట్ కు ఒప్పుకొని ఉంటే పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని.. ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలన్నా కూడా కమిట్మెంట్ అడుగుతారు. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి కూడా కమిట్మెంట్స్ అడుగుతారు అందుకే నేను వాటికి దూరంగా ఉంటున్నాని తెలిపింది ఎస్తేర్.

ఎస్తేర్ నోరోన్హా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..