Bhavana: నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
భావన ఈ అమ్మడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మహాత్మ సినిమాలో నీలాపురి గాజుల ఓ నీలవేణి అనే సాంగ్ వింటే టక్కున గుర్తొస్తుంది ఈ చిన్నది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితమా అయ్యారు. అందం , అభినయం ఉన్న ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలు మాత్రేమే చేసి ఆతర్వాత బిజినెస్ లోకి లేదా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉండటం లాంటివి చేస్తున్నారు. అలా సినిమాలకు దూరంగా ఉంటున్న ముద్దుగుమ్మల్లో భావన ఒకరు. భావన ఈ అమ్మడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మహాత్మ సినిమాలో నీలాపురి గాజుల ఓ నీలవేణి అనే సాంగ్ వింటే టక్కున గుర్తొస్తుంది ఈ చిన్నది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
భావన గోపీచంద్ సరసన ఒంటరి. నితిన్ కు జోడీగా హీరో అనే సినిమాల్లో నటించింది. కానీ శ్రీకాంత్ మహాత్మ భావనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆతర్వాత ఈ బ్యూటీ తెలుగులో కంటిన్యూ చేయలేదు. గతంలో ఓ హీరో తనను కిడ్నప్ చేశారని, లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ చేదు అనుభవం నుంచి బయట పడేందుకు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీకావాలని చూస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా భావన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. భావనకు నాలుగు సార్లు అబార్షన్ అయ్యింది అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీని పై భావన స్పందిస్తూ.. తనపై కావలనే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే నేను చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకున్నానని కూడా రూమర్స్ పుట్టించారు. అలాగే ఇంకొంతమంది నేను బ్రతికి ఉండగానే చనిపోయాను ని కూడా వార్తలు పుట్టించారు. చివరకు నన్ను ఓ తప్పుడు మనిషిగా కూడా సృష్టించారు అని ఎమోషనల్ అయ్యింది భావన. భావన ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.