Ananthika Sanilkumar: శుద్ధి అయోధ్యగా మ్యాడ్ హీరోయిన్.. అనంతిక సనీల్ కుమార్ 8 వసంతాలు.. డైరెక్టర్ ఎవరంటే..

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రానని నిరిస్తున్నారు. గతంలో వాలెంటైన్ డే రోజున ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన మేకర్స్.. ఈరోజు ఉదయం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. "365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. ఒకవేళ అంకెలతో కాకుండా అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం" అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. ఒక ప్రేమ జంట మధ్య 8 ఏళ్లలో జరిగిన సంఘటనలే ఈ 8 వసంతాలు అని చెప్పారు.

Ananthika Sanilkumar: శుద్ధి అయోధ్యగా మ్యాడ్ హీరోయిన్.. అనంతిక సనీల్ కుమార్ 8 వసంతాలు.. డైరెక్టర్ ఎవరంటే..
Ananthika Sanil Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 07, 2024 | 2:21 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సక్సెస్‏లు అందుకుంటున్న యంగ్ హీరోయిన్లలో అనంతిక సనీల్ కుమార్ ఒకరు. ఇటీవలే మ్యాడ్ సినిమాతో బ్లా్క్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో ఫాలోయింగ్ పెంచుకుంటున్న అనంతిక తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించింది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో 8 వసంతాలు అనే సినిమాలో నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రానని నిరిస్తున్నారు. గతంలో వాలెంటైన్ డే రోజున ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన మేకర్స్.. ఈరోజు ఉదయం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. “365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. ఒకవేళ అంకెలతో కాకుండా అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం” అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. ఒక ప్రేమ జంట మధ్య 8 ఏళ్లలో జరిగిన సంఘటనలే ఈ 8 వసంతాలు అని చెప్పారు.

తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో ఆమె శుద్ధి అయోధ్యగా కనిపించనున్నట్లు తెలిపారు. “19-27 ఏళ్ళ మధ్య 8 సంవత్సరాల వ్యవధిలో అనేక మంది వ్యక్తులు, భావోద్వేగాలు, ప్రదేశాలను అన్వేషిస్తూ ఆమె చేసిన ప్రయాణం. వ్యక్తిత్వం ఆమె పేరును ప్రతిబింబిస్తుంది. శుద్ధి అయోధ్య అంటే స్వచ్ఛత. ఫణీంద్ర నర్సెట్టితో తీస్తున్న 8 వసంతాలు నుంచి అనంతిక సనీల్ కుమార్ ను శుధ్ధి అయోధ్యగా పరిచయం చేస్తున్నాం” అంటూ మైత్రీ మూవీ మేకర్స్ నెట్టింట పోస్ట్ చేసింది. తాజాగా విడుదల చేసిన అనంతిక సనీల్ కుమార్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. చిన్న చిరునవ్వు, మస్కరా పెట్టిన కళ్లతో కట్టిపడేస్తుంది. అందమైన అమాయకపు అమ్మాయిగా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది అనంతిక సనీల్ కుమార్.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటి నెలకొంది. గతంలో మధురం అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఫణీంద్ర నర్సెట్టి. యూట్యూబ్‏లో రిలీజ్ అయిన ఈ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోయింది. అంతేకాకుండా పలు అవార్డులు అందుకుంది. ఈసినిమాతోనే హీరోయిన్ చాందిని చౌదరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ తో మను అనే చిత్రాన్ని తెరకెక్కించారు. క్రౌడ్ ఫండింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఫణీంద్ర ఇప్పుడు 8 వసంతాలు సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..