AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: మొదలైన ‘కల్కి’ ఫీవర్‌.. విదేశాల్లో రికార్డు స్థాయిలో..

ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్‌ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విదేశాల్లో ఒక రోజు ముందే అంటే జూన్‌ 26వ తేదీన విడుదల థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్ ఓపెన్‌...

Kalki 2898 AD: మొదలైన 'కల్కి' ఫీవర్‌.. విదేశాల్లో రికార్డు స్థాయిలో..
Kalki 2898 Ad
Narender Vaitla
|

Updated on: Jun 07, 2024 | 2:36 PM

Share

ప్రభాస్‌ అభిమానులతో పాటు, యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్‌ అవుతోంది.

ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్‌ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విదేశాల్లో ఒక రోజు ముందే అంటే జూన్‌ 26వ తేదీన విడుదల థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్ ఓపెన్‌ అయ్యాయి. గతంలో ఏ సినిమాకు లేనంతగా విదేశాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

కల్కి అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఇలా ఓపెన్‌ చేశారో లేదో అలా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని 124 లోకేషన్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు 116 థియేటర్లలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 4933 టికెట్స్‌ అమ్ముడయ్యాయి. త్వరలోనే థియేటర్ల సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపిక పదుకొణె నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీరితో పాటు పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్న కల్కి ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..