AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మనుషులను సిలువ వేసి చంపై సైకో.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8/10 రేటింగ్

ఈ సినిమాలో సైకో కిల్లర్ మరీ భయంకరంగా ఉంటాడు. మనుషులను సిలువ వేసి చంపుతాడు. అలాగే బాడీలపై బైబిల్ సూక్తులు చెక్కుతాడు. మరి ఈ సైకో కిల్లర్ ఎవరు? అతని నేపథ్యమేంటి? అసలు ఎందుకిలా ప్రవర్తించాడు అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

OTT Movie: మనుషులను సిలువ వేసి చంపై సైకో.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8/10 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 11:57 AM

Share

జీతూ జోసెఫ్.. దృశ్యం సినిమాలతో దక్షిణాదిలోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడీ మలయాళ డైరెక్టర్. ఇతను తెరకెక్కించిన ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం అని చెప్పవచ్చు. ఈ డైరెక్టర్ దృశ్యం కంటే ముందు ఆ తర్వాత పలు సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను కూడా తెరకెక్కించాడు. అయితే అందులో కొన్ని తెలుగులో రిలీజ్ కాలేదు. కానీ మలయాళంలో కల్ట్ క్లాసిక్స్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఓటీటీలో ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే.. ఇది కూడా దృశ్యం సినిమాకు ఏ మాత్రం తగ్గదు. కథా కథనాలు, ట్విస్టులు, ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఐఎమ్ డీబీలో అయితే ఇప్పటికీ ఈ సినిమాకు 8.0/10 రేటింగ్ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇందులో హీరో ఒక పోలీసాఫీసర్. కానీ ఓ కేసులో శత్రువులు అతని భార్యను, కూతురిని దారణంగా కాల్చి చంపేస్తారు. దీంతో హీరో డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. జాబ్ కూడా వదిలేస్తాడు. ఇదే సమయంలో నగరంలో దారుణ హత్యలు జరుగుతాయి. చనిపోయిన ప్రతి వ్యక్తినీ చేతులు కట్టి, ఊపిరాడకుండా చేసి క్రూరంగా చంపుతుంటారు. దీంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారుతుంది. చివరకు హీరోకే ఈ కేసు బాధ్యతలు అప్పగిస్తారు.

దర్యాప్తు చేపట్టిన హీరో హత్యలన్నీ ఒకే పద్ధతిలో జరుగుతున్నాయని తెలుసుకుంటాడు. అలాగే చనిపోయిన వారందరికీ గతంలో ఒక కామెన్ కనెక్షన్ ఉందని కనుక్కుంటాడు. అంతేకాకుండా కిల్లర్ బైబిల్ వాక్యాలను వాడుకుని మతపరమైన కోణంలో చేస్తున్నాడన్న సంచలన విషయం తెలుస్తుంది? మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? పోలీసులు ఆ క్రిమినల్ ను ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా స్టోరీ.

ఇవి కూడా చదవండి

మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పేరు ‘మెమొరీస్’ (Memories). విజయరాఘవన్ సురేష్ కృష్ణ కీలక పాత్రలో మెరిశారు. అలాగే బెండు అప్పారావు సినిమా హీరోయిన్ మేఘనా రాజ్ మరో ప్రధాన పాత్రలో మెరిశారు. ఇది పాత సినిమానే అయినా దృశ్యం-3 రిలీజ్ నేపథ్యంలో మరోసారి ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ‘మెమొరీస్’ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?
పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?
ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఏ అంతస్తు శుభప్రదమో..
ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఏ అంతస్తు శుభప్రదమో..
చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే..!
చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే..!
గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్.. నేడే చివరి అవకాశం..
గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్.. నేడే చివరి అవకాశం..
కలెక్టర్ స్థాయి నుంచి నటుడిగా మారా..
కలెక్టర్ స్థాయి నుంచి నటుడిగా మారా..
మరణించిన వారి వస్తువులు.. ఏవి ఉంచాలి, ఏవి తీసేయాలి? సనాతన ధర్మం..
మరణించిన వారి వస్తువులు.. ఏవి ఉంచాలి, ఏవి తీసేయాలి? సనాతన ధర్మం..
కొబ్బరి గసగసాలతో కోడి కూర.. ఇలా వండారంటే 2 ప్లేట్లు తింటారు
కొబ్బరి గసగసాలతో కోడి కూర.. ఇలా వండారంటే 2 ప్లేట్లు తింటారు
గిల్ అరుదైన రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!
గిల్ అరుదైన రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!
చూసేకి పెద్దమనిషే.. సార్ ట్యాలెంట్‌ తెలిస్తే మతిపోద్ది!
చూసేకి పెద్దమనిషే.. సార్ ట్యాలెంట్‌ తెలిస్తే మతిపోద్ది!
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!