AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే కన్నతల్లి శాపంతో ఇప్పుడు ఇలా..

తెలుగు, తమిళ చిత్రసీమలో నటి నళిని ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. ప్రేమసాగరం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నళిని, రవితేజ "కిక్", "వీడే" వంటి చిత్రాలలో ప్రతినాయిక పాత్రలతో మెప్పించారు. ముఖ్యంగా సీరియల్స్‌లో అత్త పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.

ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే కన్నతల్లి శాపంతో ఇప్పుడు ఇలా..
Actress Nalini
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2026 | 11:55 AM

Share

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేసుకున్న నటి నళిని సినీ, వ్యక్తిగత జీవిత ప్రయాణం ఎంతో విశేషమైనది. ముఖ్యంగా విలన్ పాత్రలతో, సీరియల్స్‌లో అత్త క్యారెక్టర్లతో ఆమె ప్రేక్షకులకు సుపరిచితులు. తమిళనాడులో జన్మించిన నళిని, ఎనిమిది మంది సంతానంలో రెండవ కుమార్తె. ఆమె తండ్రి మూర్తి ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాగా, తల్లి ప్రేమ ప్రొఫెషనల్ డ్యాన్సర్. సినిమా వాతావరణంలో పెరిగిన నళిని, చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. తెలుగులో ప్రేమసాగరం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నళిని, యూత్ ఆడియన్స్‌లో విశేష ఆదరణ పొందారు. రవితేజ నటించిన కిక్ సినిమాలో స్టార్టింగ్ సన్నివేశాలలో, వీడే చిత్రంలో పూర్తి నిడివి విలన్ పాత్రలో ఆమె నటన అద్భుతంగా పండింది. చిరంజీవి సినిమాలైన సంఘర్షణ, పున్నమనాగు, ఇంటిగుట్టు వంటి వాటిలోనూ ఆమె నటించారు. ఈ మధ్య కాలంలో చామంతి వంటి సీరియల్స్‌లో అత్త క్యారెక్టర్‌తో బాగా పాపులర్ అయ్యారు.

తమిళంలో సత్యరాజ్, విజయకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలో, అసిస్టెంట్ డైరెక్టర్ రామరాజన్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించి, నళినిని కేరళకు పంపించి మోహన్‌లాల్, మమ్మూట్టి వంటి వారితో సినిమాలు చేయించారు. అయితే, రామరాజన్ మద్రాస్ కు వెళ్లి నళినిని కారులో తీసుకువచ్చి, తాళి కట్టి వివాహం చేసుకున్నారు. రామరాజన్ ఆ తర్వాత కరగట్టక్కారన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందారు. నళిని తల్లి తన కూతురిని విడిచిపెట్టి వెళ్తూ, “నువ్వు వాడిని వదిలేసి మళ్ళీ మా దగ్గరికే వస్తావు” అంటూ శపించింది. 1987లో వివాహం చేసుకున్న నళిని, రామరాజన్‌ దంపతులకు అరుణ, అరుణ్ అనే కవల పిల్లలు జన్మించారు. 2000 సంవత్సరం వరకు అన్యోన్యంగా గడిపినప్పటికీ, అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. తల్లి శాపం నిజమైందని నళిని ఒంటరిగా మిగిలిపోయారు.

విడాకుల తర్వాత కట్టుబట్టలతో, పిల్లలతో బయటపడిన నళిని ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లలను పెంచాలనే బాధ్యతతో ఆమె నటనను తిరిగి ప్రారంభించారు. మొదట సినిమాలలో సహాయక పాత్రలు పోషించినప్పటికీ, ఆ తర్వాత సీరియల్స్‌పై దృష్టి సారించారు. సీరియల్స్‌లో బిజీ అయిపోయి, పిల్లలను పెంచి పెద్ద చేశారు. 2013లో కుమార్తె అరుణకు, ఆ తర్వాత కుమారుడు అరుణ్‌కు వివాహాలు జరిపించారు. పిల్లలు స్థిరపడటంతో నళిని ఎంతో సంతృప్తిగా ఉన్నారు. రామరాజన్, నళిని విడిపోయినప్పటికీ, వారి మధ్య అభిమానం అలాగే మిగిలి ఉంది. రామరాజన్ కూడా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం నళిని సీరియల్స్‌లో చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!