Actor Vishal: తన హెల్త్ కండీషన్ పై క్లారిటీ ఇచ్చిన విశాల్.. ఏమన్నారంటే..
గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హీరో విశాల్ వీడియోస్ కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మదగజ రాజు సినిమా ప్రీ ఈవెంట్లో విశాల్ పూర్తిగా బక్కచిక్కిపోయి.. వణుకుతూ కనిపించారు. నడవడానికి, మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడుతున్న విశాల్ నుంచి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు వ్యాప్తిచెందడంతో తాజాగా తన హెల్త్ పై క్లారిటీ ఇచ్చారు.
తమిళ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన మదగజ రాజు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న విశాల్.. నీరసంగా వణుకుతూ కనిపించారు. మాట్లాడేందుకు, నడిచేందుకు సైతం ఇబ్బందిపడుతూ కనిపించారు. దీంతో విశాల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే విశాల్ ఆరోగ్యం గురించి యూట్యూబ్ లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ హీరో హెల్త్ కండీషన్ పై విశాల్ మేనేజర్, అభిమానుల సంఘాలు క్లారిటీ ఇచ్చాయి. విశాల్ కేవలం వైరల్ ఫీవర్ కారణంగా ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. అలాగే నటి ఖుష్బూ, నటుడు జయం రవి సైతం విశాల్ ఆరోగ్యంపై రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన హెల్త్ గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై తాజాగా హీరో విశాల్ స్పందించారు. శనివారం సాయంత్రం మదగజ రాజ ప్రీమియర్ కు హాజరై.. తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చారు.
“మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నాను. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్ గా పట్టుకోగలుగుతున్నాను. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుదిశ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. గెట్ వెల్ సూన్. కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయి” అంటూ విశాల్ తెలిపారు.
ఇటీవల జరిగిన మదగజ రాజ సినిమా వేడుకతో పోలిస్తే ఇందులో ఆయన ఆరోగ్యంగా, ఫిట్ గా కనిపించారు. విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గత వారం చెన్నైలో చిత్రబృందం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఇందులో విశాల్ పాల్గొన్నారు. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణికాయి. పూర్తి నీరసంగా కనిపించారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..