Vijay Sethupathi: ఆ టాలీవుడ్ హీరోయిన్‏తో సినిమా చేసే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన విజయ్ సేతుపతి.. రీజన్ ఏంటంటే..

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో కంటే విజయ్ సేతుపతికి

Vijay Sethupathi: ఆ టాలీవుడ్ హీరోయిన్‏తో సినిమా చేసే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన విజయ్ సేతుపతి.. రీజన్ ఏంటంటే..
Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2021 | 2:02 PM

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో కంటే విజయ్ సేతుపతికి క్రేజ్ మాములుగా లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి.. తెలుగులో ఉప్పెన సినిమాతో గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. టాలీవుడ్‏లో నేరుగా చేసింది మొదటి సినిమా అయినా… తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో గుర్తిండిపోయే స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతినిండా సినిమాలత బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి లాభం సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‏గా నటిస్తోది. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా ఓ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా తర్వాత తమిళంలో ఓ మూవీ చేశాను. అందులో కృతి శెట్టి హీరోయిన్‏గా ఉంటే బాగుంటుందని చిత్రయూనిట్ సభ్యులు భావించారు. ఇదే విషయాన్ని నాతో చెప్పారు. వెంటనే నేను ఆమెతో సినిమా చేయను అని చెప్పాను. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి.. ఇప్పుడు ఆమె పక్కన హీరోగా చేయమంటే నేను చేయలేనని చెప్పాను.

Krithishetty

Krithishetty

అయితే నేను ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించిన విషయం ఆ యూనిట్ సభ్యులకు తెలియదు. అందుకే వారు ఆమెను నా పక్కన హీరోయిన్‏గా అనుకున్నారు. అలాగే భవిష్యత్తులోనూ ఆమెతో సినిమా చేసే ప్రసక్తి లేదని తెల్చీ చెప్పాడు. ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు కృతి కాస్త కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురులాంటిదానివే. భయపడకు.. ధైర్యంగా చెయ్ అని ప్రోత్సహించాను. కాబట్టి కూతురిలా భావించిన అమ్మాయితో ఒక జోడీగా నటించడం నా వల్ల కాదు అని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.

Also Read: Manchu Manoj: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరో మనోజ్.. ఆ విషయంపై గంటకు పైగా భేటీ..