Vijay Devarakonda: ‘అమ్మా.. మనం ఇండియాని షేక్ చేసినమే’.. దేవరకొండ ట్వీట్ వైరల్..
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 50 మిలియన్స్ వ్యూస్.. 1.5 లైక్స్ రాబట్టి బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.
యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది లైగర్ ట్రైలర్ (Liger). డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా.. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా ఏ రెంజ్లో ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు మేకర్స్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా.. అతని ప్రియురాలిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విజయ్ తల్లిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 50 మిలియన్స్ వ్యూస్.. 1.5 లైక్స్ రాబట్టి బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ లైగర్ ట్రైలర్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లైగర్ ట్రైలర్ కు వస్తోన్న రెస్పాన్స్ పై నటి రమ్యకృష్ణ స్పందించారు. బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిందంటూ ట్విట్టర్ వేదికగా ట్రైలర్ వీడియో రిలీజ్ చేయగా.. ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు విజయ్.
Happy to announce LIGER is the biggest trailer of the year ? 51 M in 24 hrs and counting#Liger@thedeverakonda @ananyapanday@miketyson @karanjohar #PuriJagannadh @apoorva1972 @ronitboseroy @meramyakrishnan @vish_666 @vikrammontroseofficial @dharmamovies @puriconnects pic.twitter.com/ijK0g58o9l
— Ramya Krishnan (@meramyakrishnan) July 22, 2022
” అమ్మా.. మనం ఇండియాని షేక్ చేసినమే..” అంటూ ట్వీట్ చేశారు విజయ్. లైగర్ అందరికీ రీచ్ చేయడంలో ఇంకా తన పని పూర్తికాలేదని..ఇప్పుడే మొదలైందంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ధర్మ మూవీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Ammaaa ❤️ Manam India shake chesinameyy.. ❤️ https://t.co/XPMOnupZrK
— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.