Raviteja: మాస్ మాహారాజా సినిమాతో ఆ టాలెంటెడ్ హీరో రీఎంట్రీ.. కీలకపాత్రలో వేణు..
మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫాంలోకి

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చాడు రవితేజ. ప్రస్తుతం మాస్ మాహారాజా ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, రావణసుర సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే… తాజాగా మాస్ మాహారాజా సినిమాలో మరో టాలెంటెడ్ హీరో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఎవరో తెలుసుకుందామా.
వేణు తొట్టెంపూడి.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన వేణు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చిరునవ్వుతో.. చెప్పవే చిరుగాలి వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత స్నేహితుడిగా.. అన్నగా.. క్యారెక్టర్ నటుడిగానూ ఆకట్టుకున్నాడు. అయితే చాలా కాలంగా వేణు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము సినిమాలో కనిపించాడు వేణు. ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ సినిమాలో వేణు కీలకపాత్రలో నటించనున్నాడని తెలిసిందే. అలాగే ధమాకా సినిమాలోనూ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.




