Actor Srikanth: హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా ?.. చాలా రోజుల తర్వాత స్టన్నింగ్ లుక్‌తో సర్ప్రైజ్ చేసిన మేధ..
శ్రీకాంత్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుండగా.. మరోవైపు అతడి కుమారుడు రోషన్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి సందడి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు రోషన్. నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం మలయాళీ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక రోషన్ కాకుండా శ్రీకాంత్‌కు మరో కుమారుడు రోహన్, కూతురు మేధ ఉన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్‌కు ఫ్యామిలీ అడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. సహాయ నటుడిగా, విలన్‌గా నటిస్తున్నాడు. ఓవైపు శ్రీకాంత్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుండగా.. మరోవైపు అతడి కుమారుడు రోషన్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి సందడి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు రోషన్. నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం మలయాళీ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక రోషన్ కాకుండా శ్రీకాంత్‌కు మరో కుమారుడు రోహన్, కూతురు మేధ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఎక్కువగా బయట కనిపించారు. శ్రీకాంత్ ఫ్యామిలీ సినిమా ఈవెంట్లలో ఎక్కువగా కనిపించరు. కేవలం రోషన్, శ్రీకాంత్, ఊహ మాత్రమే అప్పుడప్పుడు పలు ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. తాజాగా శ్రీకాంత్ కుటుంబం వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
గురువారం శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. తల్లిదండ్రులతోపాటు కుమార్తె మేధ, చిన్న కుమారుడు రోహన్ సైతం తిరుమలకు వచ్చారు. శ్రీకాంత్ కుటుంబాన్ని చూసిన జనాలు వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించగా.. వారికీ సెల్ఫీలు ఇచ్చారు ఊహ, శ్రీకాంత్. అలాగే చాలా కాలం తర్వాత రోహన్, మేధను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ కూతురు మేధపైన అందరి దృష్టి పడింది. చీరకట్టులో ఎంతో సంప్రదాయపద్దతిగా అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. పింక్ డిజైన్ చీరలో అందంగా మెరిసిపోయింది మేధ. తల్లితోపాటు నవ్వుతూ నడుస్తూ కనిపించింది మేధ. సింపుల్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది మేధ. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
చాలా కాలం తర్వాత శ్రీకాంత్ ఫ్యామిలీ ప్రజల ముందుకు వచ్చింది. ముఖ్యంగా మేధను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. చీరకట్టులో మేధ ఎంతో అందంగా ఉందని.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కుమార్తెలు కథానాయికలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు కుమార్తె నిహారిక, రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక, మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




