Captain Miller: స్టార్ హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్‌తో అసభ్య ప్రవర్తన.. ఆకతాయికి దేహశుద్ది..
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే జనవరి 3న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికిల్ యాక్షన్ డ్రామాలో.. ఇదివరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు ధనుష్. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. అలాగే తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే జనవరి 3న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ వేడుకకు భారీ సంఖ్యలో ధనుష్ ఫ్యాన్స్ హజరయ్యాడు. అదే సమయంలో హోస్టింగ్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యను ఓ ఆకతాయి అసభ్యంగా తాకాడు. పదే పదే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడి తీరుతో విసిగిపోయిన యాంకర్..వెంటనే అతడికి దేహశుద్ధి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఐశ్వర్యకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై యాంకర్ ఐశ్వర్య స్పందించింది. కెప్టెన్ మిల్లర్ ప్రీ రిలీజ్ వేడుకలో ఓ వ్యక్తి తనను వేధించాడని.. వెంటనే అతడి ప్రవర్తనకు ఎదురుతిరిగానని తెలిపింది. ఆ తర్వాత అతడు పరిగెత్తడానికి ప్రయత్నించాడని.. అయిన అతడిని వదలకుండా పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. తన చుట్టూ ఎంతో మంది మంచి వ్యక్తులు ఉన్నారని.. ఈ ప్రపంచంలో చాలా మంది గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారని తాను నమ్ముతున్నానని.. అయినా కొద్దిమంది రాక్షసులు ఉండడంతో ఇంకా భయపడుతూ ఉండాల్సి వస్తుందంటూ రాసుకొచ్చింది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ నుని కెమెరా క్రాంక్ చేయగా, నాగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ మూడు భాగాల ఫ్రాంచైజీగా సెట్ చేయబడిందని, ఇది సినిమా మొదటి భాగం అని పేర్కొన్నారు డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్.
— Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.