Sonu Sood: సోనూ సూద్ భార్యకు రోడ్డు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..

|

Mar 25, 2025 | 3:53 PM

మంగళవారం ముంబై-నాగ్‌పూర్ హైవేపై జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో సోను సూద్ భార్య సోనాలి సూద్ గాయపడినట్లు సమాచారం. సోనాలి తన సోదరి కుమారుడు, మరో మహిళతో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sonu Sood: సోనూ సూద్ భార్యకు రోడ్డు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..
Sonu Sood
Follow us on

టాలీవుడ్ నటుడు సోనూ సూద్ భార్య సోనాలీ సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈరోజు ఉదయం ఆమె తన సోదరి కుమారుడితోపాటు మరో మహిళతో కలిసి వస్తుండగా.. వారి కారును ముంబై-నాగ్‌పూర్ హైవేపై ఓ ట్రక్కు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో సోనాలి సూద్ తీవ్రంగా గాయపడగా.. ఆమె సోదరి కుమారుడు, మరో మహిళ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే ఈ ఘటనలో వారి కారు తీవ్రంగా దెబ్బతింది. వెంటనే సోనాలిని నాగ్ పూర్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే నాగ్ పూర్ బయలుదేరారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని సోనూసూద్ ప్రతినిధి వెల్లడించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే వివరాలు బయటకు రావాల్సి ఉంది.

సోను సూద్ చివరిసారిగా ఫతేలో కనిపించాడు. ఈ చిత్రం కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిజ జీవిత సైబర్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..