Sonu Sood: ‘హ్యాట్సాఫ్ సోనూ భాయ్’.. తన సినిమా కలెక్షన్లను అనాథశ్రమానికి విరాళంగా ప్రకటించిన రియల్ హీరో
సోనూసూద్ మెగా ఫోన్ పట్టుకున్నారు. 'ఫతే' చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన భార్య సోనాలి ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. . జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ తారాగణం. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
ప్రముఖ నటుడు సోనూసూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికీ కొనసాగుతోంది. ఈ కారణంగానే సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూసూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.సోనూసూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్‌గా నటించినా.. నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సాయం చేశారు. జబ్బుపడిన వారికి చికిత్స అందించారు. పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ‘ఫతే’ సినిమా కలెక్షన్లను కూడా ఓ మంచి పనికి వినియోగించేందుకు రెడీ అయ్యాడు.
డైరెక్టర్ గా మొదటి సినిమా..
‘ఫతే’ చిత్రానికి సోనూసూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సోనూసూద్. సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ‘ఫతే’ సినిమాలో సోనూసూద్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూసూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్ల సొమ్మును వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలకు పంపించే ప్రయత్నం చేస్తాం’ అని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూసూద్ తెలిపారు.
సోనూసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు..
सच्चा इंसान वही है जो दूसरों की मुश्किलें हल्का कर सके।
@SoodcharityFoundation हर कदम पर कोशिश करता है कि जरूरतमंदों की ज़िंदगी में खुशियों की रोशनी भर सके।
आपका छोटा सा सहयोग किसी के लिए नई उम्मीद बन सकता है। 👉 https://t.co/7dyo77FD5Q
##SoodcharityFoundation pic.twitter.com/LgOwPFyH6g
— Sood Charity Foundation (@SoodFoundation) December 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.