Kannappa: కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు జాగ్రత్త.. నటుడి హెచ్చరిక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ముఖ్యంగా మంచు విష్ణు వరుసగా ఇంట్వర్యూల్లో పాల్గొంటున్నాడు.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రం కన్నప్ప. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా సినిమాలోని పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లను పేర్లతో సహా రివీల్ చేశారు మేకర్స్. వీటికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సాంగ్స్ కు కూడా మంచి స్పందన వస్తోంది. అదే సమంయలో కొంత మంది నెటిజన్లు కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై మంచు విష్ణు స్పందించాడు.
‘కొంతమంది ఏదైనా క్లిప్‌ను కట్ చేసి దాన్ని వైరల్ చేసి ట్రోల్స్, కాంట్రవర్సీ చేయడం వంటివి చేస్తున్నారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన జనాలు కూడా చాలా స్మార్ట్‌గా తయారయ్యారు. ఏదైనా కాంట్రవర్సీ అయితే పూర్తి వీడియోను నెట్టింట సెర్చ్ చేసి చూస్తున్నారు. మరికొందరు మాత్రం పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. అయినా అలాంటివి నేను పట్టించుకోను’ అని చెప్పుకొచ్చాడు విష్ణు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
రఘు బాబు కామెంట్స్.. వీడియో ఇదిగో..
కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి, శాపానికి గురవుతారు…
— రఘుబాబు. pic.twitter.com/cZpjHbpAnE
— Telugu360 (@Telugu360) March 23, 2025
కాగా కన్నప్ప సినిమాను ట్రోల్ చేయడంపై నటుడు రఘు బాబు వినూత్నంగా స్పందించారు. ‘కన్నప్ప సినిమాను ట్రోల్ చేయడం దారుణం. అలా చేసిన వారు కచ్చితంగా శివుడి ఆగ్రహం, శాపానికి గురవుతారు జాగ్రత్త’ అని ట్రోలర్లను హెచ్చరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఇంక నెల రోజుల్లో సినిమా రిలీజ్..
🕉️ 35 Days to Go! When faith is tested, only true devotion shines! 🌿🔥
In 35 days, witness the incredible journey of #Kannappa🏹, a man who defied all limits for his love and surrender to Lord Shiva. 🔱✨
A story of sacrifice, destiny, and divine grace is about to unfold on… pic.twitter.com/jikTVT4ZCV
— Kannappa The Movie (@kannappamovie) March 21, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.