Prakash Raj: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన ప్రకాశ్ రాజ్.. కారణమేంటంటే..
సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ఈ మధ్యన రాజకీయ వ్యవహరాల్లో కూడా బాగా తలమునకలవుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ (CM KCR) ముంబై పర్యటనకు వెళ్లినప్పుడు కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఈ సీనియర్ నటుడు.
సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ఈ మధ్యన రాజకీయ వ్యవహరాల్లో కూడా బాగా తలమునకలవుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ (CM KCR) ముంబై పర్యటనకు వెళ్లినప్పుడు కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఈ సీనియర్ నటుడు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఠాక్రే ఇంటి వరకు కేసీఆర్ వెంట ప్రకాశ్ రాజ్ ఉండటంపై పొలిటికల్ సర్కిల్‌లో సరికొత్త చర్చకు దారి తీసింది. తాజాగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ (Gajwel)లో ఆయన పర్యటించడం ఆసక్తికరంగా మారింది. గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం, ఎడ్యుకేషన్ హబ్, సమీకృత మార్కెట్ యార్డు, అర్బన్ పార్క్‌లతో పాటు, మల్లన్నసాగర్‌ను ప్రకాశ్ రాజ్ సందర్శించారు. అభివృద్ధి, ప్రజలకు అందివచ్చిన సౌకర్యాలు, సామాజిక చైతన్యంలో గజ్వేల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లాగా అన్ని నియోజకవర్గాలు మారాలని ఆకాంక్షించారు.
కాగా కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్‌కు దగ్గరగా ఉంటున్నాడు ప్రకాష్‌రాజ్. మరోవైపు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కూటమి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు గులాబీ బాస్. అందులో నటుడు ప్రకాష్ రాజ్‌కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రకాష్ రాజ్‌ను వెంటబెట్టుకొని వెళ్తున్నారు. దానికి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే రాజకీయలపై పట్టు ఉండడం సహా పలు భాషల్లో ప్రకాష్ ప్రావీణ్యుడు కావడం వల్ల, ఆయన సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జాతీయ బృందంలోనూ ప్రకాష్‌రాజ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..
Telangana: అంతా ఒరిజినల్ అన్నారు.. ఢోకా లేనే లేదన్నారు.. చివరకు వారు చేసి పని ఇది..!