Actor Prabhas: అదిదా డార్లింగ్ అంటే.. ప్రభాస్ కార్ కలెక్షన్ చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఎంత ఆస్తులు ఉన్నాయంటే..
డార్లింగ్ ప్రభాస్.. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ప్రభాస్ ఆస్తులు, కార్ కలెక్షన్ గురించి ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో డార్లింగ్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపిస్తుండడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. అలాగే తన కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు డార్లింగ్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ లైఫ్ స్టైల్, కార్ కలెక్షన్, రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. నివేదికల ప్రకారం డార్లింగ్ ఆస్తి రూ.240 కోట్లకు పైగా ఉంటుందట. ఇక ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ.2 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అంతేకాకుండా ప్రభాస్ వద్ద కార్ కలెక్షన్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. ప్రస్తుతం డార్లింగ్ వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. ఈ కారు విలువ రూ.8 కోట్లు. ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వద్ద మాత్రమే ఈ కారు ఉందట. అలాగే డార్లింగ్ దగ్గర రూ.2.08 కోట్ల విలువైన జాగ్వార్ XJR కారు సైతం ఉంది.
అలాగే రూ.1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుతోపాటు.. డార్లింగ్ గ్యారేజీలో లాంబోర్గినీ అవెంటడోర్ రోడ్ స్టర్ కారు ఉంది. దీని విలువ రూ.6 కోట్లు ఉంటుంది. అలాగే రూ.68 లక్షల విలువైన BMW X3 ఉన్నాయి. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా.. సలార్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు డార్లింగ్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..