హైద‌రాబాద్‌లో నితిన్‌, షాలిని పెళ్లికి ముహుర్తం ఫిక్స్…

ఈ ఏడాది 'భీష్మ' మూవీతో మంచి హిట్ అందుకుని.. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న యువ‌ హీరో నితిన్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 4:34 pm, Sat, 18 July 20
హైద‌రాబాద్‌లో నితిన్‌, షాలిని పెళ్లికి ముహుర్తం ఫిక్స్...

ఈ ఏడాది ‘భీష్మ’ మూవీతో మంచి హిట్ అందుకుని.. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న యువ‌ హీరో నితిన్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు. జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలినితో క‌లిసి ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న పాటిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వివాహ వేడుకను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌తో పాటు స‌న్నిహితులు, ఫ్రెండ్స్ హాజ‌ర‌వ‌నున్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. కానీ క‌రోనా కార‌ణంగా పెళ్లి వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ప్ర‌జంట్ నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు మూవీస్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య డైరెక్ష‌న్ లో ‘ప‌వ‌ర్ పేట’ చిత్రాలు చేయ‌నున్నారు.