AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మళ్ళీ ‘బాహుబలి’ కష్టాలు! ఆ సినిమా కోసం 5 ఏళ్లు ఆగాల్సిందేనా?

ఆయన బాక్సాఫీస్ వద్ద నిలబడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే.. ఆయన ఒక సినిమా చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ అంచనాలు ఆకాశాన్ని తాకాల్సిందే. ప్రస్తుతం ఇండియన్ సినిమాను శాసిస్తున్న ఆ 'రెబల్ స్టార్' చేతిలో ఇప్పుడు అర డజనుకు పైగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మళ్ళీ ‘బాహుబలి’ కష్టాలు! ఆ సినిమా కోసం 5 ఏళ్లు ఆగాల్సిందేనా?
Prabhas Raju
Nikhil
|

Updated on: Jan 25, 2026 | 9:30 AM

Share

ప్రతి సినిమా వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నదే. అయితే ఇప్పుడు ఈ అగ్ర హీరో ఎదుట ఒక విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ఒకవైపు సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఒక భారీ పీరియడ్ డ్రామా, మరోవైపు ఇంకా పట్టాలెక్కకుండానే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక పవర్ ఫుల్ పోలీస్ డ్రామా. ఈ రెండింటిలో ఏ సినిమాకు ముందు డేట్స్ ఇవ్వాలి? ఏ సినిమాను త్వరగా పూర్తి చేయాలి? అనే గందరగోళం ఇప్పుడు నెలకొంది. తాజాగా ఒక సినిమా విడుదల తేదీని ప్రకటించడం.. సగం పూర్తయిన మరో సినిమా భవిష్యత్తు అంధకారంలో పడటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ ప్రాధాన్యత మారుతోందా? అసలు ‘ఫౌజీ’ పరిస్థితి ఏంటి?

స్పిరిట్ వర్సెస్ ఫౌజీ ..

ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ ఇప్పటికే ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు సగం సినిమా పూర్తయిందని సమాచారం. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ విడుదల తేదీని (మార్చి 5, 2027) అధికారికంగా ప్రకటించారు. ఇంకా పూర్తిస్థాయిలో షూటింగ్ మొదలవ్వని సినిమాకు రిలీజ్ డేట్ ఇవ్వడం, సగం పూర్తయిన ఫౌజీకి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్ లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

అంతేకాదు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రభాస్ పూర్తిగా తనకే డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పూర్తిగా భిన్నంగా ఉండటంతో, ఒకేసారి రెండు సినిమాలు చేయడం అసాధ్యమని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ వంటి విషయాల్లో సందీప్ చాలా పట్టుదలగా ఉన్నారట. ఇదే నిజమైతే ‘ఫౌజీ’ షూటింగ్ మరింత ఆలస్యం అవ్వడం ఖాయం.

ఐదేళ్ల గ్యాప్..

గతంలో ‘బాహుబలి’ కోసం ప్రభాస్ ఐదేళ్ల కాలాన్ని కేటాయించారు. ఇప్పుడు ‘ఫౌజీ’ పరిస్థితి కూడా అలాగే మారుతుందేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ స్పిరిట్ సినిమాకే ప్రభాస్ మొదటి ప్రాధాన్యత ఇస్తే, ఫౌజీ విడుదల 2028కి వెళ్లే అవకాశం ఉందట. అంటే షూటింగ్ మొదలైనప్పటి నుండి విడుదల వరకు సుమారు నాలుగు నుండి ఐదేళ్ల గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. మరోపక్క ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ కోసం, నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ కోసం ప్రభాస్ డేట్స్ కోరుతున్నారు.

ఇన్ని భారీ ప్రాజెక్టుల మధ్య ప్రభాస్ తన షెడ్యూల్స్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతానికి ప్రభాస్ మాత్రం సందీప్ రెడ్డి వంగా సినిమాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ‘ఫౌజీ’ టీమ్ ఈ ఏడాదిలో సినిమాను పూర్తి చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ప్రభాస్ తన డేట్స్ ను ఎలా సర్దుబాటు చేస్తారో తెలిసే వరకు అభిమానులకు ఈ టెన్షన్ తప్పదు.