AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh Marriage Controversy: నరేష్ ‘నాలుగు స్తంభాలాట’కు తెరపడేదెప్పుడు..

ఆయనకు మూడు పెళ్లిళ్లు. ఆమెకు రెండు వివాహాలు. ఇవన్నీ పాత కథలు. ఇప్పుడు వారిద్దరిదీ ఒకే కథ. ఆ కథలోనే ఎన్నో ట్విస్టులు. నరేష్‌, పవిత్ర లోకేశ్‌ ఎపిసోడ్‌లో పాత కథలు ఇప్పుడు పీడకలల్లా వెంటాడుతున్నాయి.

Naresh Marriage Controversy: నరేష్ 'నాలుగు స్తంభాలాట'కు తెరపడేదెప్పుడు..
Naresh
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2022 | 7:51 PM

Share

ఆయనకు మూడు పెళ్లిళ్లు. ఆమెకు రెండు వివాహాలు. ఇవన్నీ పాత కథలు. ఇప్పుడు వారిద్దరిదీ ఒకే కథ. ఆ కథలోనే ఎన్నో ట్విస్టులు. నరేష్‌(Naresh), పవిత్ర లోకేశ్‌ ఎపిసోడ్‌లో పాత కథలు ఇప్పుడు పీడకలల్లా వెంటాడుతున్నాయి. వస్తా నీ వెనుక అంటూ నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాలిపోతున్నారు. నరేష్‌, పవిత్ర రిలేషన్‌ని పబ్లిక్‌లో పెడుతున్నారు. తప్పేంకాదు. ఇది నా ఆవేదన అని చెబుతున్నారు రమ్య రఘుపతి. నా మొగుడు నాకే సొంతం, విడాకులు గిడాకులు జాన్తా నై.. నరేష్‌ ఉంటే చాలంటున్నారు. మైసూర్‌లోని నరేష్‌-పవిత్ర ఉన్న హోటల్‌ దగ్గరకు వెళ్లి నరేష్‌ మూడో భార్య రమ్య గొడవ చేశారు. హోటల్‌ దగ్గర వారితో వాగ్వివాదానికి దిగారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ రమ్య గొడవకు దిగారు. హోటల్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించారు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు.

అయితే రమ్య వెంట వచ్చిన వారు.. నరేష్ డౌన్ డౌన్, పవిత్రా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారంతా అలా అరుస్తుంటే.. నరేష్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ, చేతులు ఊపుకుంటూ, విజిల్స్ వేస్తూ వెళ్లిపోయాడు. ఇక ఆమె ఒక మోసగత్తె.. మోసగత్తె అంటూ నరేష్ అరిచేశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లిన నరేష్ ఆమె మీద ఇంకో ఆరోపణ చేశారు. ఇధి వరకే తన భార్యకు, డ్రైవర్‌కు సంబంధం ఉందని చెప్పిన నరేష్.. మళ్లీ ఇంకో కొత్త రిలేషన్‌ను అంటగట్టారు. రాకేష్ శెట్టి అనే కొత్త పేరును వెలుగులోకి తీసుకొచ్చారు. రమ్యకు, రాకేష్ శెట్టి మధ్య సంబంధం ఉందని, వారిద్దరూ లవర్స్ అని, ఇద్దరూ కలిసి తనను మోసం చేయాలని, బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించినట్టు నరేష్ చెప్పుకొచ్చారు. రమ్య హల్‌చల్‌తో హోటల్‌ నుంచి నరేష్‌, పవిత్ర అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. రమ్య హడావుడి చేస్తుంటే నరేష్‌ విజిల్‌ వేస్తూ వెళ్లారు. నువ్వొక చీటర్‌వి అంటూ గట్టిగా అరుస్తూ లిప్ట్‌ ఎక్కి వెళ్లిపోయారు.

రమ్య మాటల్లో నిజం లేదని అంటున్నారు నరేష్‌. వేరేవారితో ఇల్లీగల్‌ అఫైర్స్‌ పెట్టుకుని..తనని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని..డబ్బు కోసం ఆమె ఈ నాటకాలు ఆడుతుందని ఆరోపించారు. నరేష్, పవిత్ర మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ అయితే ఇద్దరూ ఒకే హోటల్‌లో ఒకే గదిలో నైట్ అంతా ఎలా ఉన్నారని.. ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు రమ్య. పైగా పవిత్రతో ఓ ఛానెల్ నుంచి స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేయించారు. అందులో తాను నరేష్‌తో సహజీవనం చేస్తున్నట్లు పవిత్ర చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పైగా ఈ ఇద్దరి కలయికపై ఎప్పటికప్పుడు కన్నేసే ఉంచారు రమ్య. అందులో భాగంగానే మైసూరులోని హోటల్‌లో ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రమ్య.  నరేష్‌,మూడో భార్య రమ్య రఘుపతి విడివిడిగా ఉంటున్నారు. ఈ మధ్యలోనే ఆయన పవిత్రతో కలిసి ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వరం వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నరేష్‌, పవిత్ర పెళ్లి చేసుకున్నారని స్టోరీలు నడిచాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వకుండా వాళ్లిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తోంది రమ్య.

ఇవి కూడా చదవండి

నరేష్‌ కుటుంబంతో కలిసి ఉంటున్నానని చెప్పారు పవిత్ర లోకేష్‌. రమ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్ధంకావడం లేదని అన్నారు. గతవారం రోజుల నుంచి నరేష్‌ కుటుంబ వ్యవహారం హాట్‌టాపిక్‌ అయింది. తాజాగా మైసూర్‌లో జరిగిన ఘటనతో మరింత గందరగోళంగా మారింది. మరి ఈ ఎపిసోడ్‌లో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయి. ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నరేష్ ఈ మ్యాటర్ ఎలా సెటిల్ చేయబోతున్నారు. రమ్య కాంప్రమైజ్ అవుతుందా లేదా. పవిత్ర పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రస్తుతానికి సమాధానం శూన్యమే.. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి