Kamal Haasan: అవకాశం వస్తే ‘ది కేరళ స్టోరీ’ సినిమాను మీరు బ్యాన్ చేస్తారా ?.. కమల్ హాసన్ రియాక్షన్ ఏంటంటే..
ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అలాగే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీపై సినీ, రాజకీయ ప్రముఖులు విభిన్న కామెంట్స్ చేయగా.. గతంలో సీనియర్ హీరో కమల్ హాసన్ సైతం ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. సినిమా ట్యాగ్ లైన్ వద్ద నిజమైన కథాంశం అనే రాస్తే సరిపోదంటూ కౌంటరిచ్చారు. తాజాగా మరోసారి ది కేరళ స్టోరీ సినిమా ఇష్యూపై స్పందించారు కమల్.

ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శల మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ది కేరళ స్టోరీ. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. విడుదలైన 20 రోజుల్లోనే దాదాపు 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ సృష్టించింది. లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అలాగే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీపై సినీ, రాజకీయ ప్రముఖులు విభిన్న కామెంట్స్ చేయగా.. గతంలో సీనియర్ హీరో కమల్ హాసన్ సైతం ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. సినిమా ట్యాగ్ లైన్ వద్ద నిజమైన కథాంశం అనే రాస్తే సరిపోదంటూ కౌంటరిచ్చారు. తాజాగా మరోసారి ది కేరళ స్టోరీ సినిమా ఇష్యూపై స్పందించారు కమల్.
ఇటీవల జరిగిన ఇండియా టూడే కాంక్లేవ్ సౌత్ 2023లో పాల్గొన్న ఆయన.. ది కేరళ స్టోరీ సినిమా బ్యాన్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిర్మాతలు 32 వేల మంది మహిళలు ఇస్లాం మతంలోకి మారినప్పటి నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే వివరణ ఇచ్చారు. దీంతో ఈసినిమాపై క్రెడిబిలిటీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.. దీనిపై కమల్ స్పందిస్తూ.. “నేను ఆ సినిమా చూడలేదు. కానీ ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో విన్నాను. నాకు తెలిసినంతవరకు ఆ చిత్రంలోని కొన్ని విషయాలు జరిగి ఉండవచ్చు.. కానీ ఎంతమంది మహిళలు అని చెప్పలేను. ” అని అన్నారు.




అలాగే అవకాశం మీకు వస్తే కేరళ స్టోరీని నిషేధిస్తారా ? అని అడగ్గా.. “నేను ఏ సినిమాను బ్యాన్ చేయను.. వారిని మాట్లాడనివ్వండి.. సినిమా ఉద్దేశ్యం ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా సినిమాపై తమిళనాడులో నిషేధం విధించారు.. అప్పుడు విశ్వరూపం గురించి జనాలు అడిగితే… ఈ సినిమాను ఎందుకు నిషేధించారని ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. రాజ్ కమల్ ఫిలింస్, తమిళనాడు ప్రభుత్వం మధ్య కేసు నడిచింది. కేసు గెలిచి మేము సినిమాను విడుదల చేశాం. నేను ఏ సినిమాను బ్యాన్ చేయడాన్ని సమర్థించను. వాస్తవానికి, సర్టిఫికేషన్ బోర్డును సెన్సార్ బోర్డుగా మార్చడంలో, చిత్రాలను నిషేధించడం లేదా ఎడిటింగ్ చేయడంలో నేను బలమైన న్యాయవాదులలో ఒకడిని. ఈ దేశానికి వాక్ స్వాతంత్ర్యం ఉండాలి. వారు చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వగలరు. కొంతమంది ఈ చిత్రాన్ని చూడలేకపోయారు. ఆడియన్స్ సస్పెండ్ చేసిన అవిశ్వాసంతో కేరళ స్టోరీ లాంటి సినిమా చూసి ఆ తర్వాత ఆలోచించాలి.” అని అన్నారు.
