AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Jeeva: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. బారికేడ్స్‏ను ఢీకొట్టిన కారు..

కుటుంబంతో కలిసి చెన్నై నుంచి సేలం వెళ్తున్న జీవా.. కన్నియమూర్ వద్దకు రాగానే ఆకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయేందుకు యత్నించగా.. ఆయన కారు రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో జీవాతోపాటు అతడి భార్యకు స్వల్ప గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రిలో చేర్చారు.

Actor Jeeva: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. బారికేడ్స్‏ను ఢీకొట్టిన కారు..
Jeeva
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2024 | 4:00 PM

Share

కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ఢీకొట్టినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో జీవా కారు దెబ్బతినగా.. జీవాతోపాటు ఆఅతడి భార్యకు స్వల్పంగా గాయలైట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కుటుంబంతో కలిసి చెన్నై నుంచి సేలం వెళ్తున్న జీవా.. కన్నియమూర్ వద్దకు రాగానే ఆకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయేందుకు యత్నించగా.. ఆయన కారు రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో జీవాతోపాటు అతడి భార్యకు స్వల్ప గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. జీవా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాత ఆర్.బి. చౌదరి చిన్న కొడుకు. ఇదిలా ఉంటే.. జీవాకు దక్షిణాదిలో మంచి గుర్తింపు ఉంది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన జీవా.. రంగం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఈ మూవీ తర్వాత స్నేహితుడు మూవీతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇటీవలే యాత్ర 2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. 1989 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించిన ’83’ మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో మెరిశారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తమిళ్ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు జీవా.

Jeeva News

Jeeva News

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.