AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmaji: నటుడు బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల ఆఫర్… దయచేసి ఆ డబ్బును మీరు తీసుకోండి అంటూ ట్వీట్..

కంగ్రాట్స్.. మీ మొబైల్ నంబర్ లక్కీ డ్రా గెలుచుకుంది. మీకు ఇన్ని లక్షల డబ్బులు ఆఫర్ గా వచ్చాయి... నగదు మీ అకౌంట్లోకి పంపిస్తాము.. మీ పూర్తి వివరాలను

Brahmaji: నటుడు బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల ఆఫర్... దయచేసి ఆ డబ్బును మీరు తీసుకోండి అంటూ ట్వీట్..
Brahmaji
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2021 | 2:52 PM

Share

కంగ్రాట్స్.. మీ మొబైల్ నంబర్ లక్కీ డ్రా గెలుచుకుంది. మీకు ఇన్ని లక్షల డబ్బులు ఆఫర్ గా వచ్చాయి… నగదు మీ అకౌంట్లోకి పంపిస్తాము.. మీ పూర్తి వివరాలను ఈ నంబర్ కు మేసేజ్ లేదా ఈ అడ్రస్‏కు మెయిల్ చేయండి.. అనే మెసేజ్ లు తరచూ మన ఫోన్ కు వస్తూనే ఉంటాయి. ఒకవేళ ..నమ్మి పూర్తి వివరాలు పంపితే.. ఇక అంతే సంగతులు… మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు.. వివరాలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలో పడ్డట్లే. ప్రస్తుతం టెక్నాలజీ వాడకం ఎక్కువగా కావడం.. ప్రతి ఒక్కరు ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ ఎక్కువగా చేసేస్తున్నారు. అలాగే అకౌంట్స్, నగదు వివరాలు మొత్తం ఫోన్ ద్వారానే ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆఫర్స్, లక్కీ డ్రా అంటూ మెసేజ్ లు పంపుతూ.. ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ కేవలం సామాన్యులకు మాత్రమే కాదండోయ్.. సెలబ్రెటీలకు సైతం వచ్చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి భారీ ఆఫర్ నటుడు బ్రహ్మాజీని వరించింది.

మీ ఫోన్ నంబరుకు రూ.4.65 కోట్లు లాటరీ తగిలిందని.. యునైటెడ్ కింగ్ డమ్ కి చెందిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మీకు ఈ నగదు అందనుందని పేర్కొంటూ బ్రహ్మాజీకి మెసేజ్ వచ్చింది. అయితే ఈ సొమ్ము కలెక్ట్ చేసుకోవాలంటే.. మీ పేరు, ఫోన్ నంబర్, వయసు, అడ్రస్, వృత్తి వివరాలతో ఒక మెయిల్ ఐడికి మెయిల్ చేయాలని మెసేజ్ వచ్చింది. అది చూసిన బ్రహ్మాజీ ఆ మెసేజ్ ఫేక్ అని గుర్తించి వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఏకంగా పోలీసులకు ట్యాగ్ చేశాడు.

“సార్, ఈ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. దయచేసి ఆ సొమ్ము మీరే తీసుకోండి ” అంటూ ఆ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ వేదికగా.. సైబరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. బ్రహ్మాజీ ట్వీట్ చూసిన నెటిజన్లు రకారకాల కామెంట్స్ ఇస్తున్నారు.

ట్వీట్..

Also Read: Yadadri Bhuvanagiri: వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నెల‌ 22న గ్రామానికి వస్తానంటూ..

Indian IT sector: ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . త్వరలో భారత్ లో టాప్ ఐటీ కంపెనీల్లో భారీగా నియామకాలు